జయలలిత అందానికి ఫిదా అయిపోయా.. ప్రేమించా.. ఆ ప్రేమ మారదంతే: ఖట్జూ లవ్‌నోట్
జయలలిత త్వరలో కోలుకుని.. సీఎం పదవిని చేపడుతారని తన ఫేస్ బుక్ పేజీలో సంచలన వ్యాఖ్యలకు మారుపేరుగా నిలిచిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ ఖట్జూ ఆకాంక్షించారు. అంతటితో ఆగకుండా జయలలితను
తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యంతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. 3 వారాల పాటు ఆస్పత్రిలో ఉన్న ఆమె త్వరగా కోలుకోవాలని, ఇంటికి చేరుకోవాలని.. సీఎం పగ్గాలు చేపట్టాలని ప్రముఖులు ఆకాంక్షిస్తున్న సంగతి విదితమే.
ఈ నేపథ్యంలో జయలలిత త్వరలో కోలుకుని.. సీఎం పదవిని చేపడుతారని తన ఫేస్ బుక్ పేజీలో సంచలన వ్యాఖ్యలకు మారుపేరుగా నిలిచిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ ఖట్జూ ఆకాంక్షించారు. అంతటితో ఆగకుండా జయలలితను తాను అప్పట్లో ఏకపక్షంగా ప్రేమించానని పేర్కొని వివాదానికి తెరలేపారు.
ఇంకా ట్విట్టర్లో ఖట్జూ ఏమన్నారంటే.. జయలలిత సింహంలాంటి మనిషని.. ఆమెను వ్యతిరేకించే వారు కోతులని వ్యాఖ్యానించారు. తాను యువకుడిగా ఉన్నప్పుడు జయలలిత అందానికి ఫిదా అయిపోయానని.. ఆమెను ప్రేమించానని.. ఆ విషయం జయలలితకు తెలియదన్నారు. ఆమెపై తనకు గల ప్రేమ ఎప్పటికీ మారదని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం జయలలిత ఆకర్షించే అందం కనుమరుగైనా.. ఆమె పట్ల తనకున్న ప్రేమ తగ్గదని చెప్పుకొచ్చారు. త్వరలో ఆమె కోలుకోవాలని ఆశించారు. ఇలా ఫేస్ బుక్‌లో ఖట్జూ చేసిన వ్యాఖ్యలకు కామెంట్స్ వెల్లువెత్తాయి. షేర్లు శరవేగంగా పుంజుకున్నాయి. లైక్స్ అదిరిపోయాయి. కానీ ఖట్జూ కామెంట్స్ వివాదాస్పదం అవుతుందనే ఉద్దేశంతో.. వెంటనే ఫేస్ బుక్ పేజీ నుంచి ఖట్జూ తొలగించారు.