కరుణానిధి ఆరోగ్యంపై కావేరీ తీరు భేష్.. ఫోటోతో కూడిన ప్రకటన రిలీజ్.. అమ్మకే అది కరువైంది..
డీఎంకే అధినేత, మాజీ సీఎం కరుణానిధి ఆరోగ్యంపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో.. వదంతులకు చెక్ పెట్టే దిశగా కావేరీ ఆస్పత్రి యాజమాన్యం భేష్ అనిపించుకుంది. ఈ క్రమంలో కరుణానిధి ఫోటోతో కూడిన హెల్త్ బులిటెన్‌ను వ
డీఎంకే అధినేత, మాజీ సీఎం కరుణానిధి ఆరోగ్యంపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో.. వదంతులకు చెక్ పెట్టే దిశగా కావేరీ ఆస్పత్రి యాజమాన్యం భేష్ అనిపించుకుంది. ఈ క్రమంలో కరుణానిధి ఫోటోతో కూడిన హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. కరుణానిధి ఆరోగ్యం ఎలా ఉందోనని పార్టీ కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో కరుణ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని.. ఆయన మెల్ల మెల్లగా కోలుకుంటున్నారని.. ఆంటీ బయోటిక్స్ ఇస్తున్నామని.. పూర్తిగా కోలుకున్నాక కరుణను డిశ్చార్చ్ చేస్తామని కావేరి యాజమాన్యం ప్రకటించింది. ఇందులో భాగంగా కరుణానిధి కూర్చుని టీవీ చూస్తున్నట్లు గల ఫోటోను కూడా కావేరీ ఆస్పత్రి యాజమాన్యం విడుదల చేసింది.
కానీ ఈ ఫోటోను చూసినవారంతా దివంగత సీఎం జయలలిత పట్ల అపోలో ఇలా వ్యవహరించి వుంటే ఎంత బాగుండేదని వాపోతున్నారు. 75 రోజుల పాటు అమ్మ ఆస్పత్రిలో ఏం చేశారు? ఆమె ఫోటోలు, ఆమెకు అందించిన వైద్య చికిత్సల పట్ల వట్టి బులిటెన్లు మాత్రమే విడుదల చేసిన అపోలో యాజమాన్యం.. ఫోటోలను ఏమాత్రం లీక్ చేయలేదు.
దీనిని బట్టి అమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందారా ? లేకుంటే..? బ్రెయిన్ డెడ్ అయినా కూడా చికిత్స అందిస్తున్నట్లు నటించారా అనే దానిపై మిస్టరీ వీడలేదు. కరుణ లాగానే.. అపోలో కూడా అమ్మ చికిత్స పొందే ఫోటోలను విడుదల చేసి వుంటే అమ్మ ఆరోగ్య పరిస్థితిపై ప్రజలకు కాస్త ఊరట నిచ్చివుండే అవకాశం ఉండేదని.. కానీ అపోలో యాజమాన్యం ఆ పని చేయలేదని ప్రజలు వాపోతున్నారు. మొత్తానికి జయలలిత మరణంపై నెలకొన్న మిస్టరీ ఏమాత్రం వీడేట్లు లేదని ఆమె ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.