సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 3 జూన్ 2019 (12:32 IST)

నన్ను చేసిన వ్యక్తి కుమార్తెను రేప్ చేసి పగ తీర్చుకున్నా...

తనపై చిన్న వయసులో ఉండగా లైంగికదాడి జరిగింది. ఆ తర్వాత తనపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తి కుమార్తెపై అత్యాచారం చేసి ప్రతీకారం తీర్చున్నా. అక్కడ నుంచి అత్యాచారాలు చేయడం మొదలు పెట్టా. ఇప్పటివరకు 12 మంది అమ్మాయిలను రేప్ చేసివుంటా. కానీ, ఏ ఒక్కరూ తనపై ఫిర్యాదు చేయకపోవడంతో తన అత్యాచారాలపర్వం కొనసాగుతూ వచ్చిందని మదర్సాలో పనిచేసే ఉపాధ్యాయుడు ఒకరు వెల్లడించారు. గత 38 యేళ్లుగా అత్యాచారాలు చేస్తూ వచ్చానని చెప్పాడు. ప్రస్తుతం ఆయన వయసు 63 యేళ్లు. ఇప్పటికి అతనిపాపం పండి పోలీసులకు చిక్కాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కేరళ రాష్ట్రంలోని అలువాకు చెందిన యూసుఫ్ గత రెండేళ్లుగా థలయోలపరంబు అనే మదర్సాలో ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు. ఈయనపై మదర్సా కార్యకలాపాలను నిర్వహించే మసీదు కమిటీ కొడుంగల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఓ ఫిర్యాదు ఇచ్చింది.
 
వారం రోజుల క్రితం ఓ బాలుడుని ఖురాన్ నేర్పిస్తానంటూ యూసుఫ్ తన గదికి పిలిచాడు. అతనిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత భయంతో వణికిపోతూ ఇంటికి వెళ్లాడు. దీనిపై తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం వెల్లడించారు. ఆ బాలుడు తల్లిదండ్రులు మదర్సా నిర్వాహకులకు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి యూసుఫ్‌ను అరెస్టు చేశారు. 
 
అయితే, యూసుఫ్ వద్ద పోలీసులు జరిపిన విచారణలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. తాను చిన్న వయసులోనే అత్యాచారానికి పాల్పడినట్టు చెప్పాడు. ఆ తర్వాత తనపై అత్యాచారం చేసిన కుమార్తెను రేప్ చేసి పగ తీర్చుకున్నట్టు చెప్పాడు. అలా 25 యేళ్ళ వయసు నుంచే అత్యాచారాలు చేస్తూ వచ్చానని, ఇప్పటివరకు తనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని చెప్పాడు. ఇప్పటివరకు 12 మందిపై లైంగికదాడికి పాల్పడినట్టు చెప్పారు.