శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 29 మే 2019 (15:02 IST)

ఆ ఇసుక పాముల ధర రూ.2.5 కోట్లా? ఎందుకో తెలుసా?

థానే పోలీసులు రెండు ఇసుక పాములను స్వాధీనం చేసుకున్నారు. వీటి ధర మార్కెట్‌లో రూ.2.45 కోట్లని చెబుతున్నారు. ఇంతకీ పోలీసులు ఇసుక పాములను ఎలా పట్టుకున్నారన్నదే కదా మీ సందేహం. 
 
మహారాష్ట్రలోని థానే పట్టణంలోని నవ్ఘర్ పోలీసు స్టేషన్ పరిధీలో పోలీసులు రాత్రి పూట పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఒకదానికొకటి పొంతనలేని సమాధానాలు చెప్పారు. ఆ తర్వాత వారివద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా, అందులో అటవీ ప్రాంతంలో తిరిగే రెండు ఇసుక పాములను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. 
 
మార్కెట్‌లో వీటి ధర రూ.2.45 కోట్లుగా ఉంటుందని పోలీసులు తెలిపారు. అలాగే, పాములు కలిగివున్న మొహ్మద్ యూసుఫ్ ఖురేషి (47), శంభూ అచ్చేలాల్ పాశ్వాన్ (39) అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరూ ముంబై వాసులుగా గుర్తించారు. వీరిపై వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ చట్టం కింద కేసు నమోదు చేశారు. 
 
ఈ పాములను ఎక్కడ పట్టుకొచ్చారన్న దానిపై వారివద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ తరహా పాములను కొన్ని రకాల మందుల తయారీతో పాటు.. కాస్మాటిక్స్ తయారీలో ఉపయోగిస్తారు. దీంతో ఈ పాములకు అంతర్జాతీయ మార్కెట్‌లో భలే గిరాకీవుంది.