బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (10:56 IST)

పెళ్లికూతురు కిరాక్ డ్యాన్స్ చేసిన వేళ.. వైరల్ అయిన వీడియో

సోషల్ మీడియా ప్రభావం ప్రస్తుతం అంతా ఇంతా కాదు. మునుపటి రోజుల్లో పెళ్లి కూతురంటే.. తలవంచుకుని.. సిగ్గుపడి పెళ్లి మండపంలో కూర్చుని తాళి కట్టించుకుంటుంది. కానీ ప్రస్తుతం సీన్ మారింది. పెళ్లి కూతురు అందంగా ముస్తాబై.. తన వివాహ వేడుకలో డ్యాన్సులు చేయడం ఫ్యాషనైపోయింది. 
 
అంతేకాకుండా వధూవరులు డ్యాన్సులు చేయడం వాటిని వీడియోలో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయడం మరింత ట్రెండింగ్‌గా మారింది. ఇలాంటి వీడియో ప్రస్తుతం పిచ్చా బోలెడు వున్నాయి. తాజాగా ఓ వధువు... పెళ్లికూతురిగా ముస్తాబై కిరాక్ డ్యాన్స్ చేస్తూ వివాహ మండపంలోకి వచ్చింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
మండపంలో అడుగుపెడుతూనే తన బృందంతో కలిసి ఆ వధువు డ్యాన్స్‌తో అదరగొట్టేసింది. వరుడు సహా పెళ్లికి హాజరైన వారు ఆమె డ్యాన్స్‌కు మైమరిచిపోయారు. ఈ ఘటన కేరళలోని కన్నూరులో జరిగింది. 
 
కాబోయే శ్రీవారిని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాలని ముందే నిర్ణయించుకున్న వధువు.. తన బృందంతో కలిసి మలైమారు అనే పాటకు స్టెప్పులేసి అందరి దృష్టిని ఆకర్షించింది. పెళ్లికి హాజరైన వారిలో ఒకరు ఆమె డ్యాన్స్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో క్షణాల్లోనే వైరల్ అయింది. ఆమె డ్యాన్స్‌కు నెటిజన్లు కూడా ఫిదా అయిపోతున్నారు.