శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 21 జనవరి 2020 (20:37 IST)

పెళ్ళికి ముందే షాక్, వధువు తల్లితో పారిపోయిన వరుడి తండ్రి, ఎక్కడికి?

వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. తాత్కాలిక సూఖాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు.  వైవాహిక జీవితంలో అడుగుపెట్టాల్సిన ఒక జంట పెళ్లి నిశ్చయం అయిన తర్వాత పెళ్లి పెటాకులు అయింది. అది వధువు తల్లి, వరుడు తండ్రి చేసిన ఓ ఘనకార్యంతో అంటే ఆశ్చర్యం కలుగకమానదు.  
 
గుజరాత్‌లోని కటార్‌గ్రాంకి చెందిన ఒక నలభై ఎనిమిదేళ్ళ వ్యక్తి, నవ్సారీకి చెందిన నలభై యారేళ్ళ మహిళ ఇరుపొరుగు కుటుంబాలు కావడంతో చాలాకాలంగా వారి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇరు కుటుంబాల మధ్య రాకపోకలు పెరిగాయి. వారి కుటుంబాలకు చెందిన కొందరు పెద్దలు మహిళ కూతురిని, ఆ వ్యక్తి కొడుకుకి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. 
 
అనుకున్నట్లుగానే ఫిబ్రవరిలో పెళ్లి ముహుర్తం పెట్టుకున్నారు. ఫిబ్రవరిలో ఘనంగా వివాహం చేయాలని నిర్ణయించారు. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ఎవరూ ఊహించని ఘటన చోటుచేసుకుంది. వరుడు తండ్రి, వదువు తల్లి జనవరి 19 నుంచి కనిపించకుండా పోయారు.
 
ఈ పెళ్లి జరిగితే వరుసకు వరుడి తండ్రి, వధువు తల్లి అన్నాచెల్లెళ్లు అవుతారు. దీంతో వారు కనిపించకుండా పోయారు. అయితే వారిద్దరి నడుమ గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉండటంతో పెళ్లి జరిగితే అన్నాచెలెళ్లు అవ్వాల్సి వస్తుందని దీంతో ఇద్దరు కలిసి చెప్పాపెట్టకుండా పారిపోయారు. ‎
 
వధువు తల్లి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. ఈలోగా పెళ్లికొడుకు తండ్రి కూడా కనిపించపోవడంతో అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఇద్దరు మంచి స్నేహితులు కావడం ఒకరంటే ఒకరు విడిచి వుండలేకపోవడంతో ఇద్దరూ పారిపోయారని బంధువులు అనుమానిస్తున్నారు. దీంతో బంధువులు పిల్లల పెళ్లి ఆపేశారు. వారి కోసం పోలీసులు, బంధువులు వెతుకులాట ప్రారంభించారు.