సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 8 జనవరి 2020 (16:17 IST)

అల్లుడితో కాపురం చేయొద్దని కూతురిపై అత్యాచారం చేసిన తండ్రి

పరాయి చూపు పడకుండా కంటికి రెప్పలా కాపాడాల్సిన కూతురి పైనే ఓ తండ్రి కన్నేశాడు. మైనారిటీ తీరకుండా కూతురికి పెళ్లి చేశాడు. కొద్దిరోజులకే కూతురు, అల్లుడిని తన ఇంటికి రప్పించుకున్నాడు. తన భార్య, అల్లుడు ఇంట్లో లేని సమయంలో కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
అల్లుడితో ఇక నుంచి కాపురం కూడా చేయవద్దంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. కన్నతండ్రి కారణంగా ఆమె గర్భం దాల్చడం మరింత దారుణమైన విషయం. ఈ వేధింపులు, బాధలన్నీ భరించలేక ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
గుంటూరు జిల్లా నల్లచెరువు 19వ లైన్‌కి చెందిన మహంకాళి నాగరాజు అనే వ్యక్తికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కూలి పనులు చేస్తూ జీవనం సాగించేవారు. పెద్ద కుమార్తె పెళ్లై వేరో చోట వుండగా మైనారిటీ తీరకుండానే తన రెండో కుమార్తెకు వివాహం జరిపించాడు. కొంతకాలం తరువాత కూతురు, అల్లుడిని తన ఇంట్లోనే తెచ్చిపెట్టుకున్నాడు.
 
అప్పటికే అతని కన్ను తన కూతురిపై ఉంది. ఎలాగైనా అనుభవించాలనే పథకంతోనే వాళ్ళని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాడు. ఒకానొక సమయంలో చూసుకుని భార్య, అల్లుడు కూలి పనులకు వెళ్ళగా కూతురు ఇంట్లోనే ఉండేలా పథకాలు వేశాడు. వాళ్ళు లేని సమయంలో కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 
 
ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరిస్తూనే అల్లుడితో కాపురం చేయవద్దని బెదిరించాడు. దీంతో ఆమె గర్భం కూడా దాల్చింది. తండ్రి కారణంగా ఆమె తల్లి కాబోతుండడాన్ని.. దాంతో పాటు భర్తకు విషయం తెలిసి అతని నుంచి వేధింపులు రావడంతో తట్టుకోలేకపోయింది. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నాగరాజుకు దేహశుద్థి చేసి పోలీసులకు అప్పగించారు బంధువులు.