మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: మంగళవారం, 31 డిశెంబరు 2019 (20:53 IST)

మహేష్ బాబుకు స్టెప్పుకు ట్రోల్... ఆ క్యారెక్టరుతో లింక్ పెడుతూ...

ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు చిత్రం త్వరలో విడుదల కాబోతోంది. అంతకుముందే టీజర్ విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. అంతేకాదు ఒక ఐటెం సాంగ్ కూడా విడుదలైంది. అందులో మహేష్ బాబు తమన్నాతో కలిసి నటించాడు. డాంగ్ డాంగ్ సాంగ్ ప్రోమోతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ పిచ్చ ఎంజాయ్ మూడ్‌లో ఉన్నారు. అలాగే ఈ సాంగ్ అదిరిపోయేలా ఉండేసరికి యూట్యూబ్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.
 
ఇదంతా బాగానే ఉన్నా ఇప్పుడు ఇదే సాంగ్ పైన సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా గట్టిగానే పడుతున్నాయి. ఎంత మంచి చెప్పినా సరే అందులో చెడు వాసన చూడటం మన వాళ్ళకి అలవాటే కదా... అలా ఈ సాంగ్‌లో మహేష్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలు పెట్టారు.
 
ఈ సాంగ్ ప్రోమోలో మహేష్ వేసిన ఒక స్టెప్ ఫేమస్ కమెడియన్ మిస్టర్ బీన్‌తో పోలుస్తూ ఆ రెండింటినీ పక్క పక్కన పెట్టి ట్రోల్స్ చేస్తున్నారు. తమ హీరోతో పాటు వేరే హీరోకి కూడా సపోర్ట్ ఇచ్చేవరకు మన వాళ్ళు బాగుపడకపోగా మన హీరోల పరువును ఇతరుల దగ్గర తీసిన వాళ్ళు అవుతారంటున్నారు విశ్లేషకులు. అయితే ఇండస్ట్రీలో ఏ హీరో కూడా పర్ఫెక్ట్ కాదు ఎవరికి ఉండాల్సిన లోపాలు వారికి ఉన్నాయని అభిమానులు గుర్తించాలంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే దీనిపై ఇప్పటి వరకు మహేష్ బాబు స్పందించలేదు.