ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 20 మార్చి 2018 (18:05 IST)

ప్రొఫెసర్ అలా అన్నాడని నగ్న వక్షోజాల ఫోటో పోస్ట్ చేసిన యువతి, షేర్ చేసిన భర్త...

సామాజిక మాధ్యమాలు వచ్చాక నిరసనలు తెలియజేయడం కూడా విభిన్నంగా వుంటోంది. ఓ ప్రొఫెసర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ మహిళ తన నగ్న వక్షోజాల ఫోటోలను ఫేస్ బుక్‌లో షేర్ చేసింది. మరో విషయం ఏమిటంటే... ఆ ఫోటోలను ఆమె భర్త చాలామందికి షేర్ చేశాడు.

సామాజిక మాధ్యమాలు వచ్చాక నిరసనలు తెలియజేయడం కూడా విభిన్నంగా వుంటోంది. ఓ ప్రొఫెసర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ మహిళ తన నగ్న వక్షోజాల ఫోటోలను ఫేస్ బుక్‌లో షేర్ చేసింది. మరో విషయం ఏమిటంటే... ఆ ఫోటోలను ఆమె భర్త చాలామందికి షేర్ చేశాడు. ఇంతకీ ఇలా ఎందుకు చేశారు... ఆ ప్రొఫెసర్ చేసిన పని ఏమిటి... తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే.
 
కేరళలోని కోజికోడ్‌లో టీచర్ ట్రెయినింగ్ కేంద్రంలో ఓ ప్రొఫెసర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ముస్లిం అమ్మాయిలు తమతమ హిజాబ్‌లను సరిగా ధరించకపోవడం వల్ల వారి ఎద భాగం ఆకృతులు సగానికి కోసిన పుచ్చకాయ ముక్కల్లా వున్నాయంటూ వ్యాఖ్యలు చేశాడు. దీనితో అతడిపై మహిళలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కొందరైతే అతడి వ్యాఖ్యలకు నిరసన తెలియజేస్తూ నగ్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. 
 
స్థానిక కళాశాలల్లోని విద్యార్థునులు సదరు ప్రొఫెసర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అతడిపై చర్యలు తీసుకునేవరకూ తాము సగానికి కోసిన పుచ్చకాయ ముక్కల్ని అతడికి బహుమానంగా పంపుతామని చెప్పారు. మరికొందరైతే తమ నగ్న వక్షోజాలను ఫోటో తీసి వాటిని ఫేస్ బుక్‌లో షేర్ చేశారు. వీటిని ఫేస్ బుక్ తొలగించేసింది. అలా నగ్న ఎద భాగాన్ని పోస్ట్ చేసిన 25 ఏళ్ల యువతి మాట్లాడుతూ.... ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని తెలిపింది. 
 
ఇటీవలే సోషల్ మీడియాలో ఓ మోడల్ ఓ చంటి పిల్లవాడికి పాలు ఇస్తూ మేగజైన్ కవర్ ఫోటోలు ఇస్తున్న ఈ దశలో ఓ ప్రొఫెసర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని తెలిపింది. అందువల్లనే తను న్యూడ్ బ్రెస్ట్ ఫోటోను పోస్ట్ చేసినట్లు వెల్లడించింది. ఈ ఫోటోలను పోస్ట్ చేయడం తన భర్తకు తెలుసుననీ, ఆయనే తన ఫోటోలను ఇతర సామాజిక మాధ్యమాలకు షేర్ చేసారంటూ తెలిపింది. కాగా సదరు ప్రొఫెసర్ ను కాలేజీ యాజమాన్యం వెనకేసుకొచ్చింది. అతడు మాట్లాడిన కొన్ని భాగాలను మాత్రమే కట్ చేసి ఇలా వక్రీకరించారనీ, పైగా అతడు మాట్లాడింది కూడా కాలేజీలో కాదంటూ వెల్లడించింది. ఐతే మహిళలు మాత్రం అతడిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.