1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 14 జులై 2023 (12:57 IST)

చంద్రయాన్-3 రహస్యాలను వెల్లడించడానికై ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ మైల్‌స్వామితో ఖుల్ కే రౌండ్‌టేబుల్‌

image
అర్థవంతమైన సంభాషణలను పెంపొందించడానికి అంకితమైన వినూత్న సోషల్ నెట్‌వర్కింగ్ యాప్, ఖుల్ కే, బెంగళూరులోని UR రావు శాటిలైట్ సెంటర్ మాజీ డైరెక్టర్, భారతదేశపు ప్రఖ్యాత 'మూన్ మ్యాన్' డాక్టర్ మైల్‌స్వామి అన్నాదురై చేత రౌండ్‌టేబుల్‌ను నిర్వహించింది. ఖుల్ కే యొక్క రౌండ్ టేబుల్ సెషన్ ద్వారా వినియోగదారులు డాక్టర్ అన్నాదురైతో నేరుగా మాట్లాడటానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందించింది, రాబోయే చంద్రయాన్-3 మిషన్‌తో పాటుగా విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లో అమర్చడానికి ఉద్దేశించిన పరిశోధనా పరికరాలను గురించి కూడా వెల్లడించారు. 
 
చంద్రయాన్ మిషన్ 1, 2 మరియు 3 వరకు అభివృద్ధి చేయబడిందని అన్నాదురై తెలిపారు. చంద్రయాన్ -2 మిషన్ సమయంలో విక్రమ్ ల్యాండర్ ఎదుర్కొన్న సవాళ్లపై కూడా ఆయన మాట్లాడారు. పూర్తిగా పరీక్షించాల్సిన సరళమైన వ్యవస్థను కలిగి ఉండాలన్న ఆయన, చివరి లెగ్ చాలా వేగంగా ఉంటుంది, కానీ దానికి వివరణాత్మక ప్రణాళిక అవసరం, ఈసారి చంద్రయాన్ 3లో ఎలాంటి లోపాలు లేకుండా శ్రద్ధ పెట్టబడిందని భావిస్తున్నానని ఆయన చెప్పారు.
 
చంద్రుని దక్షిణ ధ్రువాన్ని అన్వేషించడం యొక్క విశేషమైన ప్రాముఖ్యత గురించి కూడా ఆయన వెల్లడించారు. ప్రభావవంతమైన వ్యక్తులతో వినియోగదారులను కనెక్ట్ చేయడం ద్వారా, తగిన పరిజ్ఞానం అందించడం ద్వారా, అర్థవంతమైన చర్చలలో పాల్గొనడానికి అవకాశాన్ని ఖుల్ కే అందిస్తుంది.