శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 19 నవంబరు 2016 (16:16 IST)

డ్రగ్ కేసు నుంచి తప్పించారు.. సుష్మా స్వరాజ్‌కు కిడ్నీ దానమిస్తా : ఇంజనీర్

రెండు కిడ్నీలు చెడిపోయి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు తమ కిడ్నీలు దానం చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివర

రెండు కిడ్నీలు చెడిపోయి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు తమ కిడ్నీలు దానం చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, జోధ్‌పూర్‌కు చెందిన ఓ రైతు కిడ్నీలు దానం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. 
 
తాజాగా ముంబైకు చెందిన ఇంజనీర్ ఫహీమ్ అన్సారీ ముందుకు వచ్చారు. సుష్మాకు తన కిడ్నీ దాన ఇస్తానంటున్నారు. మాల్దీవుల్లో అక్రమంగా డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న తనను సుష్మా స్వరాజ్ కాపాడారని అన్సారీ గుర్తుచేశారు.
 
మాల్దీవుల్లో డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నప్పుడు తన కుటుంబ సభ్యులు బీజేపీ ఎంపీ కిరీట్ సోమయ్యను కలిశారని ఆయన తమ కుటుంబ సభ్యులను సుష్మా స్వరాజ్ వద్దకు తీసుకెళ్లారని ఫహీమ్ అన్సారీ చెప్పారు. ఆ తర్వాత సుష్మా స్వరాజ్ విదేశాంగ మంత్రి స్థాయిలో మాల్దీవుల ప్రభుత్వంతో మాట్లాడి తనను కేసు నుంచి తప్పించారని చెప్పారు. 
 
ఈ కేసు నుంచి తనను విముక్తుడిని చేసి తనకు జీవితాన్ని పున:ప్రసాదించిన సుష్మకు కిడ్నీ ఇచ్చి రుణం తీర్చుకోవాలనుకుంటున్నానని ఫహీమ్ అన్సారీ తన మనోగతం వెల్లడించారు. ఈ ప్రకటనతో అవయవాలను దానానికి కులమతాలు అతీతం కాదని మరోమారు నిరూపితమైంది.