భర్తకు చర్మవ్యాధి.. తాగొచ్చి లైంగిక వేధింపులు.. కత్తిపీటతో నరికి?
మహిళలపై వయోభేదం లేకుండా అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. ఇంటి నుంచి వెలుపలకు వస్తే మహిళలపై అఘాత్యాలు ఓ వైపు జరుగుతుంటే.. మరోవైపు ఇంట్లోనూ వేధింపులు అధికమవుతున్నాయి. ఇలా తనను రోజూ వేధించే భ
మహిళలపై వయోభేదం లేకుండా అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. ఇంటి నుంచి వెలుపలకు వస్తే మహిళలపై అఘాత్యాలు ఓ వైపు జరుగుతుంటే.. మరోవైపు ఇంట్లోనూ వేధింపులు అధికమవుతున్నాయి.
ఇలా తనను రోజూ వేధించే భర్తను మహిళ హతమార్చింది. వేధింపులు భరించలేక ఓపిక నశించిన ఓ మహిళ తన భర్తను కత్తిపీటతో నరికి చంపేసిన ఘటన తమిళనాడులోని పెరంబలూరు జిల్లా వేప్పందట్ట, తోండమాదూరులో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. సెల్వరాజ్, లూర్థుమేరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సెల్వరాజ్ మద్యానికి బానిస అయ్యాడు. కొన్ని సంవత్సరాలుగా అతడు చర్మ వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో లూర్థుమేరి ఆయనను ముట్టుకోవడం లేదు.
సెల్వరాజ్ మాత్రం మద్యం తాగి ఇంటికి వచ్చి ఆమెను లైంగికంగా వేధించాడు. మద్యం తాగి వేధింపులకు దిగిన సెల్వరాజ్‌ను ఆమె కత్తిపీటతో నరికి చంపేసింది. వేధింపులకు తాళలేకే ఈ పని చేశానని పోలీసుల ముందు లొంగిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.