శాడిస్ట్ రాజేష్‌కు బెయిల్ ఎందుకు ఇచ్చారంటే?
శోభనం రోజు రాత్రిని కాళరాత్రిగా మార్చి కట్టుకున్న భార్యకు జీవితంలో మరచిపోలేని జ్ఞాపకంగా మిగిల్చిన శాడిస్ట్ రాజేష్‌కు చిత్తూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో వైద్య నివేదిక తర్వాత రాజేష్ తరపు న్
శోభనం రోజు రాత్రిని కాళరాత్రిగా మార్చి కట్టుకున్న భార్యకు జీవితంలో మరచిపోలేని జ్ఞాపకంగా మిగిల్చిన శాడిస్ట్ రాజేష్‌కు చిత్తూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో వైద్య నివేదిక తర్వాత రాజేష్ తరపు న్యాయవాది చేసిన వాదనతో కొంత ఏకీభవించిన న్యాయమూర్తి, నిందితుడికి బెయిల్ మంజూరు చేశారు.
ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసే రాజేష్‌కు రెండు నెలల క్రితం శైలజ అనే యువతితో వివాహమైంది. శోభనం నాటి రాత్రి, గదిలో నుంచి బయటకు వచ్చిన శైలజ, తన భర్త నపుంసకుడని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆపై గదిలోకి వెళ్లిన ఆమెను రాజేష్ దారుణంగా కొట్టాడు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం రేపింది.
ఆ తర్వాత దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు రాజేష్‌ను అరెస్టు చేశారు. అదేసమయంలో రాజేష్‌కు పురుషత్వ పరీక్షలు చేయాలని కోర్టు ఆదేశించింది. రాజేష్‌కు పురుషత్వ పరీక్షలు నిర్వహించిన వైద్యులు, అతను నపుంసకుడు కాదని, అంగస్తంభన, వీర్య స్కలనం సాధారణంగానే ఉన్నాయని నివేదిక ఇచ్చారు.
దీన్ని పోలీసులు కోర్టుకు అందించగా, తొలి రాత్రి ఉండే భయం, ఆతృత తన క్లయింటులో ఉందని, దాన్నే నపుంసకత్వంగా శైలజ చూపిందని, ఆ ఆగ్రహంతోనే తన క్లయింట్ దాడి చేశాడని రాజేష్ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. శోభనం నాడే భర్తకు మగతనం లేదని భార్యే బయటకు వచ్చి ఆరోపిస్తే ఎలాగని ప్రశ్నించారు. అతనికి బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో న్యాయస్థానం తదుపరి పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశిస్తూ బెయిల్ ఇచ్చింది.