శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Updated : గురువారం, 18 జనవరి 2018 (20:46 IST)

అతడికి లైంగిక పటుత్వం వుందన్న నివేదిక... బెయిల్ మంజూరు

వివాహం రోజే భార్యకు నరకం చూపించిన శాడిస్ట్ భర్త రాజేష్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. చిత్తూరులోని మొదటి సెషన్స్ కోర్టు జడ్జి రాజేష్‌కు బెయిల్ మంజూరు చేశారు. గత కొన్నినెలలకు ముందు శోభనం రోజు రాత్రి భా

వివాహం రోజే భార్యకు నరకం చూపించిన శాడిస్ట్ భర్త రాజేష్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. చిత్తూరులోని మొదటి సెషన్స్ కోర్టు జడ్జి రాజేష్‌కు బెయిల్ మంజూరు చేశారు. గత కొన్నినెలలకు ముందు శోభనం రోజు రాత్రి భార్య శైలజను హింసించి దారుణంగా కొట్టిన కేసులో భర్త రాజేష్‌ను గంగాధర నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో భాగంగా రాజేష్‌ను హైదరాబాద్ లోని నిమ్స్‌కు తరలించి లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించి రిపోర్టును కోర్టుకు అందజేశారు. 
 
అయితే రిమాండ్‌లో ఉన్న రాజేష్ గత కొన్నిరోజులుగా బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్టకేలకు ఈరోజు రాజేష్ అభ్యర్థనను అంగీకరించిన న్యాయమూర్తి బెయిల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కీలకమైన లైంగిక పటుత్వ నివేదికలో రాజేష్‌ మగాడని తేలింది. దీంతో రాజేష్‌ బెయిల్‌కు లైన్ క్లియరైంది.