గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 ఆగస్టు 2024 (12:10 IST)

ముంబై వైద్యురాలిని బెదిరించిన బాలుడు.. కోల్‌కతా ఘటన గుర్తుందిగా...

victim girl
ముంబై నగరంలో 16 యేళ్ల బాలుడు ఓ వైద్యురాలిని బెదిరించాడు. తన క్లినిక్ ముందు పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాన్ని తీయమన్నందుకు ఆ బాలుడు తీవ్రస్థాయిలో స్పందించారు. కోల్‌కతా హత్యాచార ఘటన గుర్తుందిగా అంటూ వైద్యురాలిని బెదిరించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ముంబై నగరంలోని సాథే నగర్‌లో ఒక వైద్యురాలు సొంతంగా ఓ క్లినిక్ పెట్టుకుంది. దానికి ఎదురుగా 16 యేళ్ళ బాలుడు శనివారం మధ్యాహ్నం తన స్కూటర్‌ను పార్క్ చేశాడు. దీన్ని గమనించిన వైద్యురాలు అక్కడి నుంచి దానిని తీయాలని కోరింది. దీంతో బాలుడు కోపంతో ఊగిపోతూ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనను గుర్తుచేస్తూ.. నీక్కూడా అదే గతి పడుతుంది" అంటూ ఆమెకు హెచ్చరికలు చేశాడు.
 
అంతేకాకుండా మరికొందరితో కలిసి తన భార్యపై బాలుడు దాడి చేసినట్టు బాధిత వైద్యురాలి భర్త ఆరోపించారు. తమకు సత్వర న్యాయం జరగాలని, నిందితుడు కాబట్టి తప్పించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. బాధిత వైద్యురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు.