ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (19:26 IST)

ప్రజలు డేటా తింటారా? ఆటా తింటారా? ఇదేనా దేశాన్ని మార్చడం?: ప్రధానికి లాలూ ప్రశ్న

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన "జియో డిజిటల్ లైఫ్" ప్రకటనల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కనిపించడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఫుల్ పేజ్ పత్రికా ప్రకటనల్లో ప్రధాని నరేంద్ర

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన "జియో డిజిటల్ లైఫ్" ప్రకటనల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కనిపించడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఫుల్ పేజ్ పత్రికా ప్రకటనల్లో ప్రధాని నరేంద్ర మోడీ కనిపించడం విమర్శలకు దారితీసింది. దీనిపై ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సెటైర్లు వేశారు. ప్రధాని మోడీని ''మిస్టర్ రిలయన్స్" అంటూ కేజ్రీవాల్ కామెంట్ చేశారు. 
 
అలాగే ఆయన ప్రధాని కంటే ''రిలయన్స్''కు మోడలింగ్ చేసుకుంటే మంచిదని చురకటించారు. ప్రస్తుతం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ప్రధాన మంత్రిపై తనదైన శైలిలో సెటైర్లు విసిరారు. "పేద ప్రజలు ఏం తింటారు: ఆటా (గోధుమ) లేదా డేటా?నా అంటూ ప్రశ్నించారు. 
 
తక్కువధరకు డేటా దొరుకితే.. ఎక్కువ ధరకు ఆటా లభిస్తోందని.. ఇదేనా దేశాన్ని మారుస్తామనడానికి మోడీ నిర్వచనం అంటూ అడిగారు. జియో సంస్థ డిజిటల్ ఇండియాకు ఊత మిస్తామని చెబుతూ కొత్తగా మార్కెట్‌లో తీసుకొచ్చే ''జియో" ప్రకటనలపై మోడీ బొమ్మను వాడుకోవడం వివాదాస్పదమైంది.