ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 10 జులై 2017 (10:22 IST)

80 అడుగుల లోతు బావిలో రెండేళ్ళ సింహం.. తీశారో చూడండి?

గుజరాత్ రాష్ట్రంలో ఓ రెండేళ్ళ సింహం పిల్ల 80 అడుగుల లోతు బావిలో పడిపోయింది. దీన్ని అటవీ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. గిర్ సోమనాథ్ సమీపంలో ఉన్న బావిలో ఈ రెండేళ్ల సింహం పిల్ల ప్రమాదవశాత్తు పడిపోయింద

గుజరాత్ రాష్ట్రంలో ఓ రెండేళ్ళ సింహం పిల్ల 80 అడుగుల లోతు బావిలో పడిపోయింది. దీన్ని అటవీ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. గిర్ సోమనాథ్ సమీపంలో ఉన్న బావిలో ఈ రెండేళ్ల సింహం పిల్ల ప్రమాదవశాత్తు పడిపోయింది. దీన్ని బయటకు తీసేందుకు 6 గంటలు శ్రమించారు అటవీశాఖ అధికారులు. 
 
ముందుగా బావిలోకి ఓ అధికారి బోను సహాయంతో వెళ్లి సింహం పిల్లకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆ తర్వాత సింహానికి తాడు కట్టి పైకి తీశారు. తదనంతరం సింహం పిల్లను బోనులో వేసుకుని అటవీ సిబ్బంది తీసుకెళ్లారు.