శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2016 (16:31 IST)

జయలలితకు కన్నీటి వీడ్కోలు.. రాజాజీ హాలు నుంచి బీచ్ రోడ్డుకు లాస్ట్ జర్నీ.. అన్నా, ఎంజీఆర్‌ల తర్వాత అమ్మ..!

అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు తుది వీడ్కోలుకు అంతా సిద్ధం అయ్యింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4.30 నిమిషాల వరకు రాజాజీ హాలులో ఉంచిన అమ్మ భౌతిక కాయాన్ని ఆర్మీ జీపు ద్వారా చెన్నై బీచ్ రోడ్డుకు

అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు తుది వీడ్కోలుకు అంతా సిద్ధం అయ్యింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4.30 నిమిషాల వరకు రాజాజీ హాలులో ఉంచిన అమ్మ భౌతిక కాయాన్ని ఆర్మీ జీపు ద్వారా చెన్నై బీచ్ రోడ్డుకు తీసుకెళ్తేందుకు సర్వంసిద్ధమైపోయారు. అమ్మకు తుది వీడ్కోలు పలికేందుకు భారీ ఎత్తున జనాలు రోడ్లపై బారులు తీరారు.
 
ప్రహారీ గోడల్లో, సెల్ టవర్లు, డాబాలపై నిల్చుని, కూర్చుని అమ్మ ముఖాన్ని చూడాలని సిద్ధమైపోయారు. గతంలో ఇద్దరు సీఎంలు పదవిలో ఉన్నప్పుడే ప్రాణాలు కోల్పోయిన చోటుసంపాదించుకున్న మెరీనా బీచ్‌లో అమ్మ మూడో సీఎంగా, శాశ్వత నిద్రకు స్థానం సంపాదించుకున్నారు. తద్వారా బంగాళాఖాతం మెరీనా సముద్ర తీరంలో ఒకే ప్రదేశంలో ముగ్గురి (అన్నా, ఎంజీఆర్, జయలలితల) సీఎంల స్మారక మందిరాలు కొలువుకానున్నాయి. 
 
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జరిగే అంత్యక్రియలకు ప్రభుత్వ ప్రతినిధులుగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, పొన్‌రాధాకృష్ణన్‌లు నియమితులయ్యారు. 
 
సాయంత్రం 4.30గం.కు చెన్నై మెరీనాబీచ్‌లో ఆమె పార్థివదేహానికి అంత్యక్రియలు జరుగనున్నాయి. తమిళ ప్రజలు 'అమ్మ'గా పిలుచుకునే జయలలితను కడసారి చూసేందుకు ప్రజలు రాజాజీహాల్‌ వద్దకు భారీగా చేరుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, పలువురు కేంద్ర మంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తమ 'అమ్మ'ను కడసారి చూసేందుకు తమిళ ప్రజలు వేలాది తరలివస్తున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మెరీనాలో అమ్మకు నివాళులు అర్పించి.. అంత్యక్రియల్లో పాల్గొంటారని తెలుస్తోంది.