1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 మార్చి 2021 (13:47 IST)

మహారాష్ట్ర కరోనా ఉధృతి.. 54మంది మృతి.. మళ్లీ లాక్ డౌన్

మహారాష్ట్రలో కరోనా ఉధృతి కలవరం రేపుతోంది. నిత్యం సుమారు 10 వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. కానీ, బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 13,659 కొత్త కేసులు వెలుగుచూశాయి. 54మంది మృతి చెందాయి. లక్షకు పైగా క్రియాశీల కేసులు ఆ రాష్ట్రంలోనే ఉన్నాయి.
 
దేశంలోని కొత్త కేసులు, మరణాల విషయంలో మహారాష్ట్ర వాటానే ఎక్కువగా ఉండటం అక్కడి ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రజలు స్వీయ క్రమశిక్షణ పాటించాలని మంత్రులు, అధికారులు హెచ్చరిస్తున్నారు. లేకపోతే రాష్ట్రం మరోసారి లాక్‌డౌన్‌లోకి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
 
దేశంలో కరోనా టీకా కార్యక్రమం నిరాంటకంగా కొనసాగుతోంది. రెండు దశలు కలుపుకొని మార్చి 10 నాటికి కేంద్రం 2,56,85,011 మందికి టీకా డోసులను పంపిణీ చేసింది. నిన్న ఒక్కరోజే 13,17,357 మంది టీకా వేయించుకున్నారు.