ఎంపీల జీతాల్లో 30 శాతం కోత, లోక్ సభ ఆమోదం
కరోనావైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. దీంతో దేశం మొత్తం ఆర్థిక పరిస్థితి క్షీణించిపోయాయి. కరోనా నేపథ్యంలో ఎంపీ వేతనాల్లో కోతకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మహమ్మారిపై పోరాటానికి నిధులు సమకూర్చడానికి ఏడాది పాటు ఎంపీల జీతాల్లో 30 శాతం కోత విధించాలని కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
ఏప్రిల్ 6న ఈ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన బిల్లును ఈ రోజు లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభలో ఆమోదముద్ర పడింది. మరోవైపు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, లెప్టినెంట్ గవర్నర్లు కూడా వేతనాలు కోతకు స్వచ్చందంగా ముందుకు వచ్చారు. ఎంపీ లాడ్స్ నిధులను కూడా రెండేళ్లు పాటు నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.