శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 డిశెంబరు 2019 (18:49 IST)

పబ్ జీ ఆడుతూ.. నీళ్లు అనుకుని యాసిడ్ తాగేశాడు.. చివరికి ఏమైందంటే?

పబ్ జీకి యువత బానిసలైపోతున్నారు. ఆ గేమ్ ఆడుతూ.. ప్రపంచాన్నే మరిచిపోతున్నారు. యువతే కాకుండా ఆడామగా, చిన్న పెద్దా అనే తేడా లేకుండా పబ్‌జీ ఆడుతున్నారు. అయితే తాజాగా ఒక యువకుడు పబ్ జిలో పడి ప్రాణాలే కోల్పోయాడు. నీళ్లనుకుని యాసిడ్ తాగేశాడు. అంతే ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. సౌరభ్ యాదవ్ (20) తన స్నేహితుడు సంతోష్ శర్మతో కలిసి రైలులో ప్రయాణిస్తున్నాడు. వాళ్ళు భోపాల్ నుంచి ఆగ్రా వెళ్తున్నారు. వెండి‌తో ఉన్న బాగ్ ని యాదవ్ తీసుకువెళ్తున్నాడు. ఇక ఇదే సమయంలో ఆ ఆభరణాలను శుభ్రం చేసేందుకు‌గాను ఉపయోగించే యాసిడ్ కూడా ఆ బాగ్‌లో ఉంది.
 
రైల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని పబ్‌జి ఆడుతూ యాదవ్ దాహం వేయడంతో ఆ బ్యాగులోని యాసిడ్ బాటిల్‌ను మంచినీళ్లనుకుని బయటికి  తీశాడు. ఇంకా అవి తాగేనీరు అనుకుని తాగేశాడు. శర్మ స్పందించే సమయానికే అతను మొత్తం తాగాడు. రైలు ధోల్పూర్ వద్ద ఆగనందున, యాదవ్‌కు చికిత్స అందించడం కుదరలేదు. 
 
దీనితో చికిత్స అందే లోపే అతను ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా… తాను నిత్య౦ ఆగ్రాలోని సారాఫా బజార్‌కు తీసుకువెళ్తానని అనుకోకుండా అతను ఇలా తాగేసాడని శర్మ పేర్కొన్నాడు.
 
ప్రభుత్వ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే శర్మ… తమ అబ్బాయికి కావాలనే యాసిడ్ ఇచ్చాడని… అందుకే ఈ ఘటన జరిగిందని యాదవ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.