మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Preeti
Last Modified: శుక్రవారం, 8 జూన్ 2018 (11:52 IST)

ముంబైలో మరో చరిత్ర... వారి ప్రేమకథ వింటే ఎవరైనా కన్నీళ్లు పెట్టాల్సిందే...

థానెలో ఓ ప్రముఖ బట్టల షాపుకు ఓనర్ 26 ఏళ్ల సల్మాన్. మంచి సంపాదన, ముంబైలో ఇల్లు, ఖరీదైన కారు, పెద్ద కుటుంబం, ఎలాంటి చెడు అలవాట్లు లేవు. అతను వృత్తిరీత్యా పలు మాల్‌లకు వెళ్తుండేవాడు. న‌వీ ముంబైలోని బేలాపూర్‌లో నివసిస్తూ, ఒక మాల్‌లో సేల్స్‌ గ‌ర్ల్‌గా ప‌న

థానెలో ఓ ప్రముఖ బట్టల షాపుకు ఓనర్ 26 ఏళ్ల సల్మాన్. మంచి సంపాదన, ముంబైలో ఇల్లు, ఖరీదైన కారు, పెద్ద కుటుంబం, ఎలాంటి చెడు అలవాట్లు లేవు. అతను వృత్తిరీత్యా పలు మాల్‌లకు వెళ్తుండేవాడు. న‌వీ ముంబైలోని బేలాపూర్‌లో నివసిస్తూ, ఒక మాల్‌లో సేల్స్‌ గ‌ర్ల్‌గా ప‌నిచేస్తుండేది 21 ఏళ్ల మనీషా నారాయణ్. కళ్లు తిప్పుకోలేనంత అందం, నవ్వుతూ నవ్విస్తూండే చలాకీతనం అతడిని ఆకర్షించింది. వృత్తిరీత్యా ఆ మాల్‌కు సల్మాన్ వెళ్తున్నప్పుడు వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, ప్రేమకు దారి తీసింది. 
 
నాలుగేళ్లు గాఢంగా ప్రేమించుకున్న వీరు పెళ్లి చేసుకోవడానికి రెండు కుటుంబాలు ససేమిరా అన్నాయి. ఒకరు వ్యాపారం, మరొకరు ఉద్యోగం. ఇంటి నుండి వెళ్లిపోయి బతకగలిగే ఆర్థిక బలం ఉంది. కానీ వీరు ఇరు కుటుంబాల అంగీకారంతోనే ఒక్కటవ్వాలనుకున్నారు. ఎన్నో విధాలుగా ప్రయత్నించినా కుటుంబసభ్యులలో ఎలాంటి మార్పు లేదు. ఈ క్రమంలోనే నాలుగు రోజులుగా ఇంటికి సరిగా వెళ్లటం లేదు. కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాత్రమే మాట్లాడుతున్నారు. సల్మాన్ రంజాన్ ఉపవాసం ఉంటుండటంతో ఇఫ్తార్ కోసం ఇంటికి వెళ్లి వెంటనే వచ్చేసేవాడు. 
 
పెళ్లి గురించి బాగా ఆలోచించి వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నాం అని ఇంట్లో వారికి మంగళవారం ఫోన్ చేసి చెప్పగా, మీరు పెళ్లి చేసుకుని వస్తే.. మా శవాలను చూస్తారు అనే ఊహించని సమాధానం ఇరు కుటుంబాల నుండి వచ్చింది. దీంతో మనస్తాపానికి గురైన జంట వారి కారులోనే బుధవారం సాయంత్రం విషం తాగి చనిపోయారు. ముంబై ములుంద్‌లోని మున్సిఫ్ కోర్టు ఆవరణలో కారు ఆపి సోడాలో విషం కలుపుకుని తాగారు. 
 
చాలాసేపటి నుండి కారు అక్కడే ఉండటంతో అనుమానం వచ్చి స్థానికులు పోలీసులను పిలువగా వారు వచ్చి డోర్స్ బ్రేక్ చేసి చూశారు. అప్పటికే ఇద్దరూ చనిపోయి ఉన్నారు. సల్మాన్ మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు, అయితే మనీషా కుటుంబ సభ్యులు మాత్రం ఆస్పత్రికి కూడా రాలేదు... కుటుంబ సభ్యుల మూర్ఖత్వం వలన ఒక ప్రేమ జంట ప్రాణాలు విడిచింది.