శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 22 నవంబరు 2017 (09:19 IST)

ఫోటో చూస్తే అమ్మాయి నచ్చలేదు.. ఉరేసుకున్న యువకుడు

అమ్మాయి నచ్చలేదని చెప్పినా వినిపించుకోకుండా.. అదే అమ్మాయితో వివాహం చేయించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారని తెలిసి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ వర్తూరు సమీపంలోని ముళ్లూరుల

అమ్మాయి నచ్చలేదని చెప్పినా వినిపించుకోకుండా.. అదే అమ్మాయితో వివాహం చేయించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారని తెలిసి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ వర్తూరు సమీపంలోని ముళ్లూరులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. అజయ్ (23) అనే యువ‌కుడు ఉపాధి కోసం వర్తూరు సమీపంలోని ముళ్లూరులో నివ‌సిస్తున్నాడు. ఆ యువ‌కుడికి పెళ్లి చేయాల‌ని భావించిన తల్లిదండ్రులు ఓ సంబంధం చూసి, పెళ్లి కూతురి ఫొటోను పంపారు. 
 
కానీ ఫోటోను చూసిన వెంటనే అజయ్ అమ్మాయి నచ్చలేదని చెప్పేశాడు. అయిన‌ప్పటికీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవాల‌ని త‌ల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో ఆ యువకుడు మనస్తాపం చెందాడు. తీవ్ర ఒత్తిడికి గురైన ముళ్లూరు గ్రామ సమీపంలోని నీలగిరి తోటలో చెట్టుకు ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.