బుధవారం, 5 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 6 జనవరి 2017 (14:15 IST)

జయలలితకు భారతరత్న... తోసిపుచ్చిన మద్రాస్ హైకోర్టు... ఇక లేనట్టేనా?

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు భారతరత్న పురస్కారం ఇవ్వాలనీ, ఆ ప్రకారంగా కేంద్రాన్ని ఆదేశించాలంటూ మద్రాసు హైకోర్టులో దాఖలైన పిటీషన్ ను కోర్టు తోసిపుచ్చింది. దీనితో ఇక జయలలితకు భారతరత్న అవార్డు వచ్చే అవకాశం వుందో లేదో సస్పెన్సులో పడిపోయింది.

కాగా మాజీ సీఎం జయలలితకు భారతరత్న పురస్కారం ప్రదానం చేయాలని, జయ కాంస్య విగ్రహాన్ని పార్లమెంటులో ప్రతిష్ఠించాలని కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు మంత్రిమండలి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. జయ మరణానంతరం సీఎం బాధ్యతలు చేపట్టిన ఒ.పన్నీర్‌ సెల్వం ఈ మేరకు తీర్మానం చేశారు.
 
అదేవిధంగా జయలలిత పార్ధివదేహాన్ని ఖననం చేసిన ప్రాంతంలో రూ.15 కోట్లతో స్మారక మందిరం నిర్మించాలని, రాష్ట్ర అసెంబ్లీలో చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని, భారతరత్న డాక్టర్‌ ఎంజీఆర్‌ సమాధి పేరును ''భారతరత్న డాక్టర్‌ పురచ్చితలైవర్‌ ఎంజీఆర్‌''గా మార్చడంతో పాటు జయ సమాధికి ‘పురచ్చితలైవి అమ్మ సెల్వి జె.జయలలిత స్మారక మందిరం’గా పేరు పెట్టాలని మంత్రివర్గం తీర్మానించింది. రాష్ట్ర పరిధిలో అంశాలు ప్రక్కనపెడితే, కేంద్ర స్థాయిలో చేయాల్సినవి జరుగుతాయా అనేదే అనుమానం.