బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 25 జూన్ 2018 (10:15 IST)

పంట రుణం కావాలంటే నా కోర్కె తీర్చాలి.. రైతు భార్యకు మేనేజర్ షాక్

తమ బ్యాంకులో పంట రుణం కావాలంటే తన కోర్కె తీర్చాలని, అపుడే అడిగినంత రుణం ఇస్తానంటూ ఓ రైతు భార్యకు బ్యాంకు మేనేజర్ తేరుకోలేని షాకిచ్చాడు. దీంతో ఆ మేనేజర్‌పై ఆ రైతు భార్య చేసిన ఫిర్యాదుతో కేసు నమోదైంది.

తమ బ్యాంకులో పంట రుణం కావాలంటే తన కోర్కె తీర్చాలని, అపుడే అడిగినంత రుణం ఇస్తానంటూ ఓ రైతు భార్యకు బ్యాంకు మేనేజర్ తేరుకోలేని షాకిచ్చాడు. దీంతో ఆ మేనేజర్‌పై ఆ రైతు భార్య చేసిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా మల్కాపూర్ తహసిల్‌లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఉంది. ఇందులో ఓ రైతు పంట రుణం తీసుకునేందుకు బ్యాంకుకు తన భార్యను వెంటబెట్టుకుని వెళ్లాడు. 
 
పంట రుణం కోసం వారు దరఖాస్తు చేసుకున్నారు. బ్రాంచ్ మేనేజర్ రాజేష్ హివసే ఆమె వివరాలన్నీ తీసుకుని ఆ తర్వాత ఫోనులో సంభాషించాడు. తన మనసులోని కోరిక బయటపెట్టాడు. అంతేకాదు, తన ప్యూన్‌ను కూడా ఆమె దగ్గరకు పంపాడు. మేనేజర్ చెప్పినట్టు వింటే రుణం మంజూరు చేయడంతో పాటు ప్రత్యేక ప్యాకేజీకి కింద వచ్చే ప్రయోజనాలు కూడా అందేలా చూస్తారని ప్యూన్ ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. 
 
ఆ మాటలన్నీ రికార్డు చేసిన రైతు భార్య స్థానిక పోలీసులకు అదేరోజు ఫిర్యాదు చేసింది. దీంతో బ్యాంకు మేనేజర్, ప్యూన్‌పై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితులిద్దరూ ప్రస్తుతం పరారీలో ఉండగా, వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.