గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 18 జూన్ 2018 (11:22 IST)

ఈశాన్య రాష్ట్రాలను ముంచెత్తిన వరదలు.. 17మంది మృతి.. లక్షలాది మంది?

ఈశాన్య రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. అసోం, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాల్లో ప్రజాజీవితం అస్తవ్యస్తమైంది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అసోంలో వరదల ధాటికి 17 మంది మృతి చెందారు. 7

ఈశాన్య రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. అసోం, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాల్లో ప్రజాజీవితం అస్తవ్యస్తమైంది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అసోంలో వరదల ధాటికి 17 మంది మృతి చెందారు. 716 గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. దాదాపు 8 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 
 
నిరాశ్రయులను ఆదుకునేందుకు అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సహాయ కార్యక్రమాలను వేగవంతం చేసింది. నిరాశ్రయులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి బాదితులకు మంచినీరు, ఆహార పదార్ధాలను అందిస్తున్నారు. కరీంగంజ్ ప్రాంతం, హైలకండి ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. 
 
త్రిపురలో కుండపోత వర్షాలు ప్రజాజీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంబైలోనూ భారీ వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేశాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలిస్తున్నారు.