గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 27 నవంబరు 2017 (18:42 IST)

నీపై అత్యాచారం జరిగింది... నువ్విక్కడ చదివితే స్కూల్ పరువుపోద్ది...

అత్యాచారానికి గురైన ఓ బాధితురాలి పట్ల పాఠశాల యాజమాన్యం ప్రవర్తించిన దారుణ ఘటన ఆదివారం నాడు చోటుచేసుకుంది. ఆర్మీ సిబ్బందికి చెందిన ఓ కామాంధుడు రేప్‌ చేయడంతో ఆ 15 ఏళ్ల బాలికను స్కూల్ యాజమాన్యం పాఠశాల నుంచి బహిష్కరించింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్

అత్యాచారానికి గురైన ఓ బాధితురాలి పట్ల పాఠశాల యాజమాన్యం ప్రవర్తించిన దారుణ ఘటన ఆదివారం నాడు చోటుచేసుకుంది. ఆర్మీ సిబ్బందికి చెందిన ఓ కామాంధుడు రేప్‌ చేయడంతో ఆ 15 ఏళ్ల బాలికను స్కూల్ యాజమాన్యం పాఠశాల నుంచి బహిష్కరించింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని లాథూర్‌లోని స్థానిక పాఠశాలలో 15 ఏళ్ల బాలిక 11వ తరగతి చదువుతోంది. 
 
ఆమెను పెళ్లాడుతానంటూ నమ్మించిన ఆర్మీ సిబ్బందికి చెందిన ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెపై అత్యాచారం జరిగిందని తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం ఆమెను పాఠశాలకు రావద్దంటూ, ఆమె అడ్మిషన్ రద్దు చేసి పంపేసింది. ఎందుకిలా చేశారని నిలదీస్తే... స్కూల్ పరువు ప్రతిష్టలు కాపాడేందుకే ఇలా చేసినట్లు పేర్కొనడం గమనార్హం. 
 
మరోవైపు పోలీసులు కూడా బాధితురాలికి న్యాయం చేసేందుకు కేసు నమోదు చేయాలంటే రూ. 50 వేలు లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేసినట్లు బాధిత బాలిక కుటుంబ సభ్యులు ఆరోపించారు.