శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 జనవరి 2022 (11:22 IST)

భీవండి వస్త్ర పరిశ్రమలో అగ్నిప్రమాదం - రూ.100 కోట్ల ఆస్తి నష్టం

మహారాష్ట్రలోని భీవండిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రాంతంలో ఉండే అతిపెద్ద వస్త్ర పరిశ్రమలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ పరిశ్రమ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్రమంగా అవి ఫ్యాక్టరీ అంతటికీ వ్యాపించాయి. దీంతో వస్త్రపరిశ్రమ అంతా పూర్తిగా కాలిపోయింది. ఈ అగ్నిప్రమాదంలో వస్త్రాలు పూర్తిగా కాలిపోవడంతో పొగ దట్టంగా అలముకుంది. 
 
ఈ అగ్నిప్రమాద వార్త తెలుసుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది... ఘటనా స్థలానికి చేరుకుని కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశాయి. అయితే, ఈ భారీ అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. ఈ ప్రమాదం వల్ల కోట్లాది రూపాయల విలువ చేసే దుస్తులు, సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. అయితే, అదృష్టవశాత్తు ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు.