గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 జనవరి 2022 (12:23 IST)

నాగ్‌పూర్‌లో ఓ లెస్బియన్ జంట ఎంగేజ్‌మెంట్

తెలంగాణలో ఇటీవల ఓ గే జంట వివాహం జరిగింది. తాజాగా నాగ్‌పూర్‌లో ఓ లెస్బియన్ జంట ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. త్వరలోనే వీరి వివాహం గోవాలో జరుగనుంది. సురభి మిత్ర, పరోమితా ముఖర్జీ ఇద్దరు వృతిరీత్యా డాక్టర్లు కావడం విశేషం. ఇద్దరూ ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత కుటుంబాల నుంచి వచ్చిన వారు కావడం మరో విశేషం.
 
అబ్బాయి, అమ్మాయి ప్రేమలో లాగే వీరి ప్రేమలో కూడా ట్విస్టులున్నాయి. స్టడీ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొంతకాలంగా సహజీవనం చేశారు. అయితే ముందుగా వీరి ప్రేమని పెద్దలు అంగీకరించలేదు.
 
కానీ వారిని ఒప్పించి పెళ్ళికి రెడీ అయ్యేందుకు రెండేళ్ళ సమయం పట్టింది. పరోమిత ముఖర్జీలో లెస్బియన్ లక్షణాలను ఆమె తండ్రి ముందే గుర్తించారు. ఆ తర్వాత ఆమెకి సపోర్ట్‌గా నిలిచారు. అయితే పరోమిత తల్లి మాత్రం తన కూతురు లెస్బియన్ అని తెలిసి షాక్ అయ్యింది.