గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 22 జూన్ 2022 (16:32 IST)

Maharashtra political crisis: సీఎం ఉద్ధవ్ ఠాక్రేకి కరోనా పాజిటివ్

uddhav thackeray
ఒకవైపు మహారాష్ట్ర సర్కారు సంక్షోభంలో పడిపోయింది. ఆ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేయడంతో మహా వికాస్ అఘాడీ కూటమి అధికార పీఠాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.


మరోవైపు సీఎం ఉద్ధవ్ ఠాక్రేకి కరోనా వైరస్ సోకినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది. దాంతో ఆయన హోం ఐసోలేషన్లో వున్నారు. అక్కడి నుంచే వర్చువల్‌గా ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతున్నారు.

 
కాగా ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత సంకీర్ణ ప్రభుత్వ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు ఉద్ధవ్. ఈ సమావేశం అనంతరం ఆయన తన పదవికి రాజీనామా సమర్పించే అవకాశం వున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇంకోవైపు మహారాష్ట్ర భాజపా చీఫ్ కొద్దిసేపటి క్రితం శివసేన రెబల్ ఎమ్మెల్యేలను కలిసేందుకు వెళ్లారు. దీనితో ఇక ఉద్ధవ్ సర్కార్ ఆయువు ముగిసినట్లేనని పొలిటికల్ సర్కిళ్లలో చర్చ జరుగుతోంది.