బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 10 జూన్ 2017 (14:51 IST)

మహాత్మా గాంధీ ఓ తెలివైన వ్యాపారి : బీజేపీ చీఫ్ అమిత్ షా

జాతిపిత మహాత్మా గాంధీపై భారతీయ జనతా పార్టీ చీఫ్ అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీని ఓ తెలివైన వ్యాపారితో పోల్చారు. అందుకే దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక భారతీయ జనతా పార్టీని రద్దు చేయాలని సూచించారన

జాతిపిత మహాత్మా గాంధీపై భారతీయ జనతా పార్టీ చీఫ్ అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీని ఓ తెలివైన వ్యాపారితో పోల్చారు. అందుకే దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక భారతీయ జనతా పార్టీని రద్దు చేయాలని సూచించారని ఆయన గుర్తుచేశారు. 
 
శనివారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను ఆయన ముందే పసిగట్టారని... అందుకే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని ఆయన సూచించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి విలువలు లేవని ధ్వజమెత్తారు.
 
ఆ పార్టీకి ఎలాంటి సిద్ధాంతాలు, సూత్రాలు లేవని చెప్పారు. స్వాతంత్ర్యాన్ని సాధించడం కోసమే ఆ పార్టీని ఏర్పాటు చేశారని అన్నారు. దేశంలో ఉన్న 1650 రాజకీయ పార్టీల్లో కేవలం బీజేపీ, సీపీఎంలలో మాత్రమే అంతర్గత స్వేచ్ఛ ఉందని చెప్పారు. కాంగ్రెస్‌లో సోనియా తప్పుకుంటే ఆమె కుమారుడు అధ్యక్షుడు అవుతారని... బీజేపీలో మాత్రం ఎవరు అధ్యక్షుడు అవుతారో చెప్పలేమని, అందుకు తానే నిదర్శనమన్నారు.