మేజర్ రావత్ దంపతుల పెళ్ళినాటి ఫోటో ప్రచురించిన ప్రజాతంత్ర!
భారత సైనికాధికారి మేజర్ రావత్ హెలికాప్టర్ దుర్ఘటనలో మృతి చెందిన అంశం, మీడియా కవరేజీలో వివాదాస్పదం అయింది. కొన్ని పత్రికలు కేవలం రావత్ మృతి అన్నట్లు వార్తలను హెడ్డింగులు పెట్టడం విమర్శలకు దారి తీసింది. రావత్ అంటూ, మీ చుట్టంలా సంభోదిస్తారా? ఆయన దేశ భక్తుడు, అత్యున్నత సైనికాధికారి, ఆయనకు పత్రికలు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ నెట్జన్లు విమర్శించారు.
అయితే, దేశంలో ఇంకా పాత్రికేయ విలువలు బతికి ఉన్నాయంటూ ఇండోర్ కి చెందిన ఓ పత్రిక చాటుకుంది. ఇండోర్ కి చెందిన ప్రజాతంత్ర అనే ఈ 8 పేజీల పత్రిక స్వర్గీయ జనరల్ బిపిన్ రావత్ - మధులికల వివాహ ఆహ్వాన పత్రికతో ఫుల్ సైజ్ ఫోటో ప్రచురించింది.
"క్షమించండి, మేము కత్రినా వివాహ ఫోటో ప్రచురించలేదు... ఎందుకంటే ఈ సమయంలో గ్లామర్ కంటే పవిత్ర స్మరణ ముఖ్యం" అంటూ తెలిపింది ఆ పత్రిక. ఈ పత్రికకు, వారి పాత్రికేయ సంప్రదాయ విలువలకు నెట్ జనులు నీరాజనం పడుతున్నారు.
ప్రజాతంత్ర ప్రచురించిన ఈ అరుదైన ఫోటో ఎన్నో రకాల సందేశాన్నిస్తుంది. ఈ ఫోటోలోని వారి వేష భాషలు వారి సహజ సిద్ధ సామాన్య సాధారణ మనస్తత్వాన్ని నిరాడంబరతను తెలియజేస్తున్నాయి. ఉన్నత భావాలు కలవారు ఆడంబరానికి ప్రాధాన్యం ఇవరు అని పత్రికా ముఖంగా వివరింనట్లయింది. ఈ వివాహం జరిగే నాటికి ఆయన జనరల్ కానప్పటికీ, వివాహ సమయంలోనూ బిపిన్ రావత్ ఉన్నత సైనికధికారే కావడం విశేషం.