మాల్యా రుణాలు పొందేందుకు సాయపడిన మన్మోహన్.. బీజేపీ ఆరోపణ
బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాల్లో తలదాచుకుంటున్న కింగ్‌ఫిషర్ అధిపతి విజయ్ మాల్యాకు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ సాయపడ్డారని భాజపా ఆరోపించింది. దీంతో ఐదు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న తరుణ
బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాల్లో తలదాచుకుంటున్న కింగ్‌ఫిషర్ అధిపతి విజయ్ మాల్యాకు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ సాయపడ్డారని భాజపా ఆరోపించింది. దీంతో ఐదు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ ఇరకాటంలో పడింది.
ఇదే అంశంపై భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మాట్లాడుతూ... నష్టాల్లో ఉందని తెలిసి కూడా ఆ కంపెనీకి రుణాలు ఇప్పించే విధంగా మన్మోహన్ వ్యవహరించారని ఆరోపించారు. దీనికి సంబంధించిన పత్రాలను మీడియా ముందు చూపించారు. కింగ్‌ఫిషర్‌కు నిరర్థక ఆస్తులు ఉన్నాయని తెలిసి కూడా బ్యాంకులు ఆయనకు రుణాలు ఇచ్చేలా మన్మోహన్ సాయపడ్డారన్నారు.
మునిగిపోతున్న ఓడ (కాంగ్రెస్), మునిగిపోతున్న ఎయిర్‌లైన్స్ (కింగ్‌ఫిషర్)కు సాయం చేసిందని వ్యాఖ్యానించారు. ముందు తీసుకున్న రుణాలు చెల్లించనప్పటికీ మాల్యా మళ్లీ మళ్లీ రుణాలు ఎలా పొందారని ప్రశ్నించారు. ఈ విషయంలో మాల్యాకు మాజీ ఆర్థికమంత్రి చిదంబరం సైతం సాయపడ్డారని ఆరోపించారు. ఆయనకు రుణాలు ఇవ్వాల్సిందిగా పదే పదే బ్యాంకులపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు.