బుధవారం, 19 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (22:32 IST)

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

sudigali Sudheer
సుడిగాలి సుధీర్‌‌కు ఆరోగ్యం బాగోలేదని ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్ అన్నారు. ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న రామం రాఘవం సినిమా ఈ నెల 21న రిలీజ్ కానుంది. సముద్రఖని కీలకపాత్రలో తండ్రీకొడుకుల ఎమోషన్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ధన్‌రాజ్ సుడిగాలి సుధీర్‌ను ఆహ్వానించారు. 
 
ఈ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు ఆస్పత్రిలోనే సుధీర్ వున్నాడని.. తన కోసం ఈ ఫంక్షన్‌కు వచ్చాడని అన్నాడు. "ఆరోగ్యం బాగోకపోయినా నా కోసం వచ్చాడు. నేను బాగుండాలి అని కోరుకున్న వాళ్ల‌లో సుధీర్ ముందుంటాడు. మళ్లీ ఆస్పత్రికి వెళ్ళాలి కాబట్టి వెంటనే వెళ్లిపోతాడు.. అని ధనరాజ్ అన్నాడు. ప్రస్తుతం ధనరాజ్ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
 
మూడు రోజులుగా సుధీర్ హాస్పిటల్‌లో ఎందుకున్నాడు? సుధీర్‌కి ఏమైంది? సుధీర్ హెల్త్ సమస్య ఏంటి అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక సుధీర్ హీరోగా ప్రస్తుతం G.O.A.T (Greatest Of All Times) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో తమిళ భామ దివ్య భారతి హీరోయిన్‌గా చేస్తుంది.