గురువారం, 20 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (20:04 IST)

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

Bhagyashree Borse
Bhagyashree Borse
మొదటి సినిమా ప్లాప్ వస్తే హీరొయిన్ కు అవకాశాలు పెద్దగా రావు. కాని భాగ్యశ్రీ బోర్స్ లాంటి వారికి లక్ వరించింది అని చెప్పాలి. రవితేజ సరసన మిస్టర్ బచ్చన్‌లో అరంగేట్రం చేసిన భాగ్యశ్రీ బోర్స్ కు ఫ్లాప్ వర్తించలేదు.  హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది, అయితే భాగ్యశ్రీ నటన సినిమాలు పెరిగాయి. భాగ్యశ్రీ త్వరగా అనేక ప్రాజెక్ట్‌లకు సంతకం చేసింది.

ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. మరోవైపు రానా దగ్గుబాటి నిర్మిస్తున్న సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన కాంత చిత్రంలో ఆమె మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్‌తో చేస్తుంది.
 
ఇవి కాకుండా, వెంకీ అట్లూరి దర్శకత్వం వహించే చిత్రంలో తమిళ సూపర్ స్టార్ సూర్య సరసన నటించడానికి ఆమె సంతకం చేసింది. పలు భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. ఇది భాగ్యశ్రీ తన ఎదుగుతున్న కెరీర్‌లో మరో ముఖ్యమైన ప్రాజెక్ట్‌గా నిలిచింది. ఇక, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చేసిన పి మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ పోతినేనితో కలిసి మరో తెలుగు చిత్రంలో నటిస్తోంది. ఈ  సినిమా ప్రస్తుతం రాజమండ్రి సమీపంలో షూటింగ్ జరుపుకుంటుంది. మరి లక్ అంటే ఇదేనేమో.