ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 17 మే 2017 (14:10 IST)

యువతిని వేధించి.. పెళ్లి చెడగొట్టిన యువకుడు.. యాసిడ్ పోస్తానని బెదిరించడంతో?

బీఎస్సీ నర్సింగ్ చదువుకునే విద్యార్థినిని ఓ యువకుడు వేధించాడు. వేధింపులే కాకుండా పెళ్లిని కూడా రద్దు చేశాడు. ఆపై తనను పెళ్లి చేసుకోలేదంటే యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరించాడు. వివరాల్లోకి వెళితే.. హైదర

బీఎస్సీ నర్సింగ్ చదువుకునే విద్యార్థినిని ఓ యువకుడు వేధించాడు. వేధింపులే కాకుండా పెళ్లిని కూడా రద్దు చేశాడు. ఆపై తనను పెళ్లి చేసుకోలేదంటే యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరించాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ ఫిలింనగర్‌లోని గౌతంనగర్‌లో నివసించే బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థినికి ఓ యువకుడి నుంచి వేధింపులు ఎదురవుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
అతడు బీదర్‌కు చెందిన సందీప్‌(25) అని ఆ యువతి చెప్పింది. పెళ్లంటూ చేసుకుంటే తననే పెళ్లి చేసుకోవాలని సందీప్ అంటున్నాడని.. కానీ ఏ పని చేయకుండా జులాయిగా తిరిగే అతనిని పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెప్పేసినట్లు యువతి వెల్లడించింది. దీంతో కోపం పెంచుకున్న సందీప్.. మూడు రోజుల క్రితం బీదర్‌కు చెందిన ఓ యువకుడితో ఆ యువతికి పెళ్లి నిశ్చయం కాగా సందీప్ ఆ సంబంధాన్ని చెడగొట్టాడు. 
 
తనకు ఆ యువతికి చాలా క్లోజ్ అంటూ అవాస్తవాలు పలికి వివాహాన్ని రద్దయ్యేలా చేశాడు. తన మాట వినకపోతే యాసిడ్ పోసి చంపేస్తానని హెచ్చరించాడు. అయితే యువతి ధైర్యం చేసుకుని పోలీసులను ఆశ్రయించడంతో.. ఆ యువకుడిపై నిర్భయ కేసును బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేశారు.