శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 సెప్టెంబరు 2021 (10:42 IST)

రూ.5లు తక్కువైందని.. హోటల్ యజమాని అంత పనిచేశాడా?

చిన్న చిన్న కారణాలకే గొడవలు జరుగుతున్నాయి. క్షణికావేశంలో హత్యలు జరిగిపోతున్నాయి. తాజాగా ఐదు రూపాయల కోసం ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. హోటల్‌లో భోజనం చేసిన వ్యక్తి రూ.5లు తక్కువ ఇవ్వడంతో సదరు హోటల్‌ యజమాని అతడిపై తీవ్రంగా దాడి చేశాడు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. శనివారం కేంఝర్‌ జిల్లా ఘాసిపూర్‌ పట్టణంలోని లక్ష్మీ బజార్‌ ప్రాంతంలోని ఓ హోటల్‌లో జితేంద్ర దేహురి భోజనం చేశాడు. అనంతరం హోటల్‌ యజమాని మధుసూదన్‌ సాహు రూ.45 బిల్లు అయిందని జితేంద్రకు చెప్పాడు. దాంతో జితేంద్ర తన వద్ద రూ.40 మాత్రమే ఉన్నాయని, మిగిలిన ఐదు రూపాయలు సాయంత్రం ఇస్తానని తెలిపాడు. దాంతో హోటల్‌ యజమాని తన కొడుకుతో కలిసి జితేంద్రపై దాడి చేశాడు.
 
అనంతరం జితేంద్ర స్థానిక పోలీస్‌ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు హోటల్‌ యజమానిని, అతని కుమారుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దాడి ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.