ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 8 సెప్టెంబరు 2016 (13:55 IST)

విడాకులిచ్చిన మాజీ భర్తతో భార్య కలుస్తుందనీ.. సదరు వ్యక్తి తల నరికిన భర్త

దేశ రాజధాని న్యూఢిల్లీలో ఓ దారుణం జరిగింది. ఓ మహిళ తన మొదటి భర్తకు విడాకులిచ్చి... రెండో వివాహం చేసుకుంది. అయితే, రెండో భర్తతో సంసార జీవితం చేస్తూనే మొదటి భర్తతో కలుస్తున్నట్టు రెండో భర్త అనుమానించాడు

దేశ రాజధాని న్యూఢిల్లీలో ఓ దారుణం జరిగింది. ఓ మహిళ తన మొదటి భర్తకు విడాకులిచ్చి... రెండో వివాహం చేసుకుంది. అయితే, రెండో భర్తతో సంసార జీవితం చేస్తూనే మొదటి భర్తతో కలుస్తున్నట్టు రెండో భర్త అనుమానించాడు. దీన్ని జీర్ణించుకోలేని రెండో భర్త.. మొదటి భర్త తెగనరికాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గుర్గావ్‌కు చెందిన రోహిత్ అనే 25 ఏళ్ల యువకుడు 2013వ సంవత్సరంలో ప్రియాంక అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరి మధ్య ఏర్పడిన వివాదంతో గత ఏడాది రోహిత్, ప్రియాంకలు విడాకులు తీసుకున్నారు. ఈ యేడాది ఏప్రిల్ నెలలో ప్రియాంక గుర్గావ్ ప్రైవేట్ క్యాబ్ డ్రైవరుగా పనిచేస్తున్న ముకేష్‌ను రెండో పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా ప్రియాంక ప్రతిరోజూ మాజీ భర్తను కలుస్తుంది. మాజీ భర్తను కలవడంపై ముకేష్ భార్యతో గొడవపడినా ఆమె వినలేదు. అంతే ముఖేష్ భార్య సోదరుడైన ఆనంద్, అతని ఇద్దరు స్నేహితులు అష్రఫ్, విజయ్‌లతో కలిసి భార్య మాజీ భర్త రోహిత్‌ను హతమార్చేందుకు వ్యూహం పన్నాడు. 
 
మందుపార్టీకి రమ్మని మంగోల్ పురి ప్రాంతానికి పిలిపించి రోహిత్‌తో మద్యం తాగించారు. ఆపై లాంగ్ డ్రైవ్‌కు వెళదామంటూ ద్వారకా - గుర్గామ్ ఎక్స్‌ప్రెస్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పథకం ప్రకారం విజయ్ రోహిత్‌ను తలపై కొట్టాడు. దీంతో రోహిత్ స్పృహతప్పాడు. ఆపై రోహిత్ తలను నరికారు. అక్కడే గుంత తవ్వి రోహిత్ మొండాన్ని అందులో వేసి దహనం చేశారు. రోహిత్ తలను పాలథీన్ కవరులో చుట్టి ద్వరకా పార్కులో పూడ్చిపెట్టారు. ఈ హత్య కేసులో నిందితులైన నలుగురిని అరెస్టు చేశామని డీసీపీ వివరించారు.