శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 21 అక్టోబరు 2017 (14:46 IST)

ప్రియురాలు కోరిక తీర్చలేదని బిడ్డను కిడ్నాప్ చేశాడు....

ప్రియురాలు కోరిక తీర్చలేదని కుమారుడిని కిడ్నాప్ చేశాడు ఓ తాగుబోతు. వివరాల్లోకి వెళితే.. చెన్నై కొరుక్కుపేట కామరాజర్‌ నగర్‌కు చెందిన మునియప్పన్‌ (30) భార్య సరస్వతి(26)తో విభేదాలు రావటంతో మూడేళ్ల క్రితం

ప్రియురాలు కోరిక తీర్చలేదని కుమారుడిని కిడ్నాప్ చేశాడు ఓ తాగుబోతు. వివరాల్లోకి వెళితే.. చెన్నై కొరుక్కుపేట కామరాజర్‌ నగర్‌కు చెందిన మునియప్పన్‌ (30) భార్య సరస్వతి(26)తో విభేదాలు రావటంతో మూడేళ్ల క్రితం భార్య, ఇద్దరు పిల్లలను వదిలేసి ఎటో వెళ్లిపోయాడు. కొంతకాలానికి తిరిగొచ్చాడు. ఇంతలో సరస్వతికి అదే ప్రాంతానికి చెందిన ఆనందరాజ్‌(25)తో సంబంధం ఏర్పడింది. 
 
ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీన మద్యం మత్తులో వచ్చిన ఆనంద్ రాజ్ సరస్వతిని కోరిక తీర్చమన్నాడు. అందుకు ఆమె నిరాకరించడంతో.. బలవంతపెట్టాడు. దీంతో జడుసుకున్న సరస్వతి కుమార్తెను తీసుకుని బంధువుల ఇంట్లో ఉంచి తిరిగి ఇంటికి వచ్చింది. తిరిగొచ్చేసరికి ఇంట్లో కుమారుడు కనిపించకపోవడంతో ఆర్‌కే నగర్‌ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 
 
పోలీసుల దర్యాప్తులో ఆనంద్ రాజ్ కుమారుడి కిడ్నాప్ చేసినట్లు తేలింది. దీంతో పోలీసులు అతడి ఇంటి నుంచి చిన్నారిని రక్షించారు. ఆనంద్‌రాజ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు.