గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 21 అక్టోబరు 2017 (13:51 IST)

పార్కులో అర్ధనగ్నంగా వివాహిత.. అత్యాచారం చేసి.. కొట్టి చంపేశారా?

దేశ రాజధాని నగరం ఢిల్లీలో మహిళలకు భద్రత కరువైంది. ఢిల్లీలోని గ్రేటర్ నోయిడా సెక్టార్ 22 పరిధిలోని ఓ పార్కులో అర్ధనగ్నంగా ఓ వివాహిత మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. శుక్రవారం తెల్ల‌వారు జామున కొంద‌రు

దేశ రాజధాని నగరం ఢిల్లీలో మహిళలకు భద్రత కరువైంది. ఢిల్లీలోని గ్రేటర్ నోయిడా సెక్టార్ 22 పరిధిలోని ఓ పార్కులో అర్ధనగ్నంగా ఓ వివాహిత మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. శుక్రవారం తెల్ల‌వారు జామున కొంద‌రు వ్య‌క్తులు ఓ పార్కుకు వాకింగ్‌కు వెళ్లారు. అక్కడ అర్ధనగ్నం మహిళ మృతదేహం కనిపించడంతో షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్ట‌మ్ కోసం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మృతురాలి మెడలో మంగళ సూత్రం ఉందని.. ఆమె చేతిపై రేఖ అని రాసి వుందని పోలీసులు తెలిపారు. వివాహితపై అత్యాచారం జరిగి వుండొచ్చునని.. ఆపై హత్య చేసి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.