శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 18 అక్టోబరు 2017 (10:11 IST)

హర్యానీ ఫోక్‌ సింగర్‌ దారుణ హత్య…

హర్యానీ ఫోక్‌ సింగర్‌ హర్షితా దహియా దారుణ హత్యకు గురైంది. 22 యేళ్ల వయసున్న ఈ సింగర్‌ను ఢిల్లీలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు దారుణంగా కాల్చి చంపారు. ఆమెపై కాల్పులు జరిపిన వారు తలలో, గొంతులో ఆరు బుల

హర్యానీ ఫోక్‌ సింగర్‌ హర్షితా దహియా దారుణ హత్యకు గురైంది. 22 యేళ్ల వయసున్న ఈ సింగర్‌ను ఢిల్లీలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు దారుణంగా కాల్చి చంపారు. ఆమెపై కాల్పులు జరిపిన వారు తలలో, గొంతులో ఆరు బుల్లెట్లను దించడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయిందని పోలీసులు వెల్లడించారు.
 
ఢిల్లీ పరిధిలోని నారెల్లాలో ప్రదర్శన ఇచ్చి తిరిగి వెళుతుండగా ఈ దారుణం జరిగింది. ఆమె కారును ఓవర్ టేక్ చేసిన ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారని తెలుస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా తనకు బెదిరింపులు వస్తున్నాయని, చంపుతామని అంటున్నారని హర్షిత తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టేది. ఇదిలావుంటే ‘రాగిణి’ సాంగ్స్ పాడుతూ హర్యానాలో బాగా పాపులారిటీ సంపాదించుకుంది.