హనీప్రీత్ అరెస్టు.. తండ్రి తాకడం కూడా తప్పేనా?
డేరా చీఫ్ గుర్మీత్ సింగ్ అలియాస్ డేరా బాబా దత్తపుత్రికగా చెపుతున్న హనీప్రీత్ ఇన్సాన్‌ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమెను హర్యానా పోలీసులకు అప్పగించారు.
డేరా చీఫ్ గుర్మీత్ సింగ్ అలియాస్ డేరా బాబా దత్తపుత్రికగా చెపుతున్న హనీప్రీత్ ఇన్సాన్‌ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమెను హర్యానా పోలీసులకు అప్పగించారు. అయితే, హనీప్రీత్ సింగ్ స్వయంగా పంజాబ్ పోలీసుల ఎదుట స్వయంగా లొంగిపోయినట్టు ఆమె అనుచరులు చెపుతున్నారు.
కాగా, ఆమెపై దేశ ద్రోహం కేసుతోపాటు డేరా చీఫ్‌ను తప్పించే కుట్రలో పాలుపంచుకుందని, హింసను ప్రేరేపించిందని కేసులు పెట్టారు. డేరా బాబాను జైల్లో వేసినప్పటి నుంచే హనీప్రీత్ కోసం కూడా గాలింపు చేపట్టారు. ఆమె మొదట్లో నేపాల్ పారిపోయిందని అనుమానం వ్యక్తంచేశారు.
వాస్తవానికి డేరాబాబాకు ఈమె దత్తపుత్రిక అని బాహ్యప్రపంచంలో ప్రచారం జరిగినప్పటికీ.. వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఉందనీ, వాళ్లెప్పుడూ ఒకే గదిలో పడుకునేవారని హనీప్రీత్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా ఆరోపించిన విషయం తెలిసిందే.
తన మాజీ భర్త చేసిన ఆరోపణలపై హనీప్రీత్ స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలు బాధించాయని, ఓ తండ్రి ప్రేమగా కూతురిపై చేయి వేయడా అంటూ ఆమె ఎదురు ప్రశ్నించింది. పవిత్రమైన తండ్రీ, కూతుళ్ల బంధం తమ మధ్య ఉందని చెప్పింది. ఈ కేసులో తన తండ్రిని అనవసరంగా ఇరికించారనీ, ఆయన అమాయకుడని చెప్పారు.
కాగా, ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం జరిపిన కేసులో డేరా బాబాకు పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు 20 యేళ్ళ జైలుశిక్ష విధించిన విషయం తెల్సిందే. దీంతో ఆయన రోహ్‌తక్ కోర్టులో జైలు ఊచలు లెక్కిస్తున్నారు.