ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 20 నవంబరు 2016 (12:46 IST)

రెండు పెళ్ళిళ్లు చేసుకున్నా.. భార్యలు వదిలేశారు.. కుమారుడితో వ్యక్తి ఆత్మహత్య..

రెండు పెళ్ళిళ్లు చేసుకున్నా.. భార్యలు వదిలేసి వెళ్లిపోయారు. దీంతో విరక్తి చెందిన ఓ వ్యక్తి తన కుమారుడితో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడకు చెందిన కార్పెం

రెండు పెళ్ళిళ్లు చేసుకున్నా.. భార్యలు వదిలేసి వెళ్లిపోయారు. దీంతో విరక్తి చెందిన ఓ వ్యక్తి తన కుమారుడితో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడకు చెందిన కార్పెంటర్ మూతరాజు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగుళూరులోని వైట్ ఫీల్డ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చెల్లి ఇంటకి వెళ్తూ వెళ్తూ.. ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 
కాకినాడకు చెందిన మూతరాజు‌కు ఇద్దరు భార్యలు ఉన్నారు. గొడవల కారణంగా మొదటి భార్య మూతరాజుకు దూరమైంది. భార్య వెళ్ళిపోవడంతో ఆయన కొంత కాలం కొడుకుతో ఒంటరిగానే గడిపాడు. ఆరు మాసాల క్రితం మూతరాజు మరో వివాహం చేసుకొన్నాడు. వివాహం జరిగి ఆరు మాసాలు పూర్తైంది. కాని, భార్యాభర్తల మద్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో నెల రోజుల క్రితం రెండో భార్య కూడ అతణ్ణి వదిలి వెళ్ళిపోయింది. 
 
ఇద్దరు భార్యలు కూడ అతణ్ణి వదిలి వెళ్ళిపోవడంతో ఆయన జీవితంపై విరక్తి చెందాడు. బెంగళూరులో తాను చెల్లెల్లి ఇంటికి వచ్చాడు. అక్కడే తొలుత తన కొడుకు ఉరివేసి చంపాడు. తర్వాత తాను కూడ ఆత్మహత్య చేసుకొన్నాడు. జీవితంతో విరక్తితో ఓ వ్యక్తి తన కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకొన్నాడు.