బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 26 జూన్ 2017 (15:19 IST)

ఈ యేడాది మిస్ ఇండియా ఎవరు?

ప్రతి యేడాది అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మిస్ ఇండియా పోటీలు ఆదివారం రాత్రి ముంబైలోని యష్‌రాజ్ ఫిల్మ్ స్టూడియోలో కన్నులపండువగా జరిగాయి. ఈ పోటీల్లో మిస్ ఇండియా-2017 కిరీటాన్ని హర్యానా బ్యూటీ మాను

ప్రతి యేడాది అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మిస్ ఇండియా పోటీలు ఆదివారం రాత్రి ముంబైలోని యష్‌రాజ్ ఫిల్మ్ స్టూడియోలో కన్నులపండువగా జరిగాయి. ఈ పోటీల్లో మిస్ ఇండియా-2017 కిరీటాన్ని హర్యానా బ్యూటీ మానుషి మానుషి కైవసం చేసుకోగా, తొలి రన్నరప్‌గా మిస్ జమ్మూ సనా దువా, రెండో రన్నరప్‌గా మిస్ బీహార్‌ ప్రియాంక కుమారి నిలిచారు.
 
ఈ ఫలితాల అనంతరం మానుషి మాట్లాడుతూ ఒక విజన్‌తో తాను సాగించిన జర్నీ ఫలించిందని హర్షం వ్యక్తం చేసింది. మొత్తం 30 మంది వివిధ రాష్ట్రాల అందాల భామలు ఈ పోటీల్లో పాల్గొనగా, తుది పోటీలో ఆరుగురు నిలిచారు. 
 
బాలీవుడ్‌ ప్రముఖులు రణ్‌బీర్‌ కపూర్‌, కరణ్‌జోహార్‌ తదితరులు విచ్చేసి విజేతను ప్రకటించారు. మిస్‌ వరల్డ్‌ 2016 స్టిఫానీ డెల్‌ వాలే న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. రణ్‌బీర్, అలీ భట్, సింగర్ సోనూ నిగం ఆడియెన్స్‌ను తమ ఫెర్మార్మెన్స్‌తో అలరించారు.