గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (13:00 IST)

ఎయిర్‌సెల్-మాక్సిస్‌ కేసులో మారన్ సోదరులకు ఊరట.. సుప్రీం ఏం చెప్పిందంటే?

మాజీ టెలికాం మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్‌లకు సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. ఎయిర్‌సెల్-మాక్సిస్ ఒప్పందం కేసులో వీరిద్దరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై

మాజీ టెలికాం మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్‌లకు సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. ఎయిర్‌సెల్-మాక్సిస్ ఒప్పందం కేసులో వీరిద్దరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో జప్తు చేసిన ఆస్తులను రిలీజ్ చేయాల్సిందిగా ఆదేశించవద్దని అత్యున్నత న్యాయస్థానాన్ని కోర్టు కోరింది. 
 
ఈ నేపథ్యంలో ఈ కేసుపై శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ చేపట్టే అవకాశం ఉంది. మలేషియా కంపెనీకి తన సంస్థను విక్రయించాలని ఎయిర్‌సెల్ ఓనర్‌పై మారన్ ఒత్తిడి చేశారని, ఇందుకు గాను మారన్‌కు ముడుపులు ముట్టాయని అభియోగాలున్నాయి. కానీ మారన్ సోదరులు ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఊహాజనిత ప్రకటనలతో సాక్షులు కేసును తప్పుదోవ పట్టించారని, ఇలాంటి వాదనలపై నిందితులుగా ముద్రవేయలేమని, ప్రాథమికంగా కేసును నమోదు కూడా చేయలేమని ప్రత్యేక జడ్జి తీర్పు ఇస్తూ మారన్ సోదరులను కేసు నుంచి విముక్తి చేశారు. 
 
దీనిపై మారన్ సైతం స్పందిస్తూ, ఎలాంటి ఆధారాలు లేకుండా సీబీఐ కేసు నమోదు చేసిందన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే ఇదంతా జరిగిందని, తానెప్పుడూ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదన్నారు. న్యాయవ్యవస్థపై తమకున్న నమ్మకాన్ని ప్రత్యేక కోర్టు తీర్పు మరోసారి నిలుపుకొందని అ్ననారు.