బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 27 జనవరి 2020 (08:04 IST)

మొదటి ట్రాన్స్‌వుమెన్‌ జర్నలిస్ట్‌ కి పెళ్లి

దేశంలో మొట్ట మొదటి ట్రాన్స్‌వుమెన్‌ జర్నలిస్ట్‌ హైదీ సాదియా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టంది. కేరళలోని ఎర్నాకులంలో ఇవాళ ఆమె ఇరుకుటుంబాల పెద్దల సమక్షంలో అత్తర్వ్‌ మోహన్‌ను వివాహం చేసుకుంది.

కేరళ రాష్ట్రం రూపొందిన ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్లి చేసుకున్న నాలుగో ట్రాన్స్‌జెండర్‌ హైదీ సాదియా. కాగా, సాదియా వివాహంపై ఇరు కుటుంబాల పెద్దలు హర్షం వ్యక్తం చేశారు.

వారిద్దరి మనసులు కలిశాయి. అందుకే వారి మనసులు నొప్పించకుండా వివాహానికి అంగీకంరించామని, సాంప్రదాయ పద్దతిలో పెళ్లి చేశామని వారు తెలిపారు.