బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 మార్చి 2024 (13:48 IST)

రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇపుడే చేసుకోండి... లోక్‌సభ ఎన్నికలయ్యాక కుదరదు...

hemanth - azmal
అస్సాం రాష్ట్ర ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంతు బిశ్వ శర్మ రాజకీయ నేతలకు ఓ ఆఫర్ ఇచ్చారు. రెండో పెళ్లి చేసుకోవాలనుకునేవారు ఇపుడే చేసుకోవాలని, లోక్‌సభ ఎన్నికలయ్యాక ఇది సాధ్యంకాదన్నారు. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల తర్వాత తమ రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్ - యూసీసీ) అమలు చేసి తీరుతామని ఆయన ప్రకటించారు. 
 
ముఖ్యంగా ఏఐయూడీఎఫ్ పార్టీ చీఫ్, ధుబ్రి ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్‌ రానున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ తన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి రకీబుల్ హుస్సేన్‌‌కు కౌంటరిస్తూ, యూసీసీ అంశాన్ని హిమం బిశ్వ స్పందించారు. ఎంపీ అజ్మల్‌కు మరో పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం ఉంటే ఎన్నికలకు ముందే చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత చేసుకుంటే మాత్రం జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. భార్య లేక భర్త బతికుండగానే మరో పెళ్లి చేసుకోవడం యూసీసీ ప్రకారం నేరం. దీనికి జైలుశిక్ష కూడా తప్పదని ఆయన తేల్చి చెప్పారు. 
 
ధుబ్రి స్థానం నుంచి పోటీ చేస్తున్న అజ్మల్‌పై తన ప్రత్యర్థి, కాంగ్రెస్ నేత రకీబుల్ హుస్సేన్ తనపై చేసిన విమర్శలను తిప్పికొట్టారు. రకీబుల్ తనకు పనైపోయిందని అంటున్నాడని చెబుతూ ఈ వయసులోనూ మరో పెళ్ళి చేసుకునే శక్తిసామర్థ్యం తనకుందని అజ్మల్ చెప్పారు. నేనలా చేయడం ముఖ్యమంత్రి హిమంత బిశ్వకు ఇష్టం లేకపోయినా సరే పెళ్లి చేసుకుని తీరుతానని చెప్పారు.
 
ఈ వ్యాఖ్యలపై సీఎం హిమంత బిశ్వ స్పందించారు. అజ్మల్ ఇపుడు రెండో పెళ్లి మాత్రమే మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. పిలిస్తే పెళ్లికి కూడా వెళతాం. ఎందుకంటే ఇపుడు అది చట్టబద్ధం. కానీ, ఎన్నికలయ్యాక యూసీసీ అమల్లోకి వస్తుంది. అపుడు రెండో పెళ్లి చేసుకునే ప్రయత్నం చేస్తే మాత్రం ఆ పెళ్లిని ఆపేస్తాం. అంతేకాదు ఆయనను జైలుకు పంపిస్తాం" అని హెచ్చరించారు.