సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 మార్చి 2024 (15:19 IST)

మహీ రిటైర్మెంట్ తర్వాత చెన్నైకి కెప్టెన్‌గా రోహిత్ శర్మ?

Dhoni
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మహీ రిటైర్మెంట్ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాలని  భారత మాజీ బ్యాటర్ అంబటి రాయుడు ఆశించాడు. 2025లో రోహిత్ శర్మ చెన్నైకి కెప్టెన్ కావాలని.. ఆయన నాయకత్వాన్ని చూడాలని తాను ఇష్టపడుతున్నట్లు తెలిపాడు. 
 
2024 మార్చి 22 నుంచి జరుగనున్న ఐపీఎల్ 2024లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌కు నాయకత్వ వహించట్లేదు. ఆయన స్థానంలో ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబైకి హార్దిక్ పాండ్యాను ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా నియమించింది. 
 
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ మరో 5-6 ఏళ్లు ఆడగలడు. అందుచేత ఆయన చెన్నైకి కెప్టెన్‌ మారితే బాగుంటుంది. 2025లో చెన్నై తరపున ఆడటాన్ని తాను చూడాలనుకుంటున్నట్లు అంబటి రాయుడు చెప్పాడు.