శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (18:31 IST)

మసాజ్ సెంటర్ యాప్.. గంటకు నాలుగు వేలు.. రాత్రికి 12వేలు.. బీ కేర్ ఫుల్?

స్మార్ట్ ఫోన్‌‌ల ద్వారా ఎంత ప్రయోజనం అనే విషయాన్ని పక్కనబెడితే ఎంత నష్టమనే దానిపై ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది. స్మార్ట్‌ఫోన్ల పుణ్యంతో సవాలక్ష యాప్‌లు వచ్చేస్తున్నాయి. ఆ యాప్‌ల ద్వారా పనులన్నీ సులభమవుతున్నా... కొన్ని యాప్‌ల ద్వారా మహిళలపై అకృత్యాలు చోటుచేసుకుంటున్నాయి. 
 
ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లోని మసాజ్ సెంటర్లలో వ్యభిచారం జరుగుతున్నట్లు కొన్ని నేరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కల్చర్ ప్రస్తుతం చిన్న నగరాలకు కూడా పాకుతోంది. ఇలా మధురై పోలీసులకే అశ్లీల మెసేజ్‌లు పంపిన ముఠా గుట్టు రట్టు అయ్యింది. వివరాల్లోకి వెళితే.. మదురైలో కిడ్నాప్‌ కంట్రోల్ పోలీస్‌గా పనిచేస్తున్న పళనికుమార్‌కు LOCANTO App ద్వారా మహిళలతో ఉల్లాసంగా వుండాలా అనే మెసేజ్ వచ్చింది. 
 
మహిళలతో జల్సాగా వుండాలంటే.. ఈ నెంబర్‌ను సంప్రదించాల్సిందిగా ఓ సందేశం వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై పళని కుమార్ విచారణ మొదలెట్టారు. కస్టమర్ తరహాలో ఆ ముఠాతో మాట్లాడారు. వారు కూడా దాన్ని నమ్మారు. ఇంకా మొత్తం వివరాలను వెల్లగక్కారు. ఒక గంటకు నాలుగు వేల రూపాయలని.. ఓ రాత్రికి 12 వేల రూపాయలని చెప్పారు. 
 
ఈ విషయాన్ని సహ అధికారులకు వెల్లడించి.. ఆ ముఠా చెప్పిన చోటికి పళని సామి వెళ్లారు. అక్కడ శేఖర్, అయ్యనార్, మనోజ్ కుమార్, నందిని అనే నలుగురితో కూడిన ముఠాతో పళనిసామి మాటలు కలిపారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన పోలీసులు ఆ నలుగురిని అరెస్ట్ చేశారు. ఆ ముఠా వద్ద జరిపిన విచారణలో యాప్ ద్వారా వ్యభిచారం జరుగుతున్నట్లు తేలింది.