జపాన్‌లో భారీ భూకంపం - భూకంప లేఖినిపై 7.3గా నమోదు
జపాన్ దేశం మరోమారు భారీ భూకంపానికి గురైంది. ఈ భూకంపం బుధవారం సంభవించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 7.3గా నమోదైంది. భూకంపం తీరాన్ని తాకడంతో ఉత్తర జపాన్‌లోని ఫుకుషిమా నివాసితులలో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో అధికారులు కూడా సునామీ హెచ్చరికలను జారీచేశారు.
ఈ భూకంపం తాకిడి కారణంగా టోక్యోలోని 2 మిలియన్లకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 11 ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని భారీ భూకంపం, సునామీ అతలాకుతలం చేసి న్యూక్లియర్ ప్లాంట్‌పై కూడా ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, భూ ప్రకంపనలకు సంబంధించిన పలు వీడియోలు ఇంటర్నెట్‌లో కనిపిస్తున్నాయి, వీటిలో ఓ మెట్రో రైలు కూడా ఉంది.